Begin typing your search above and press return to search.

కోకాపేట భూములు: రేపు బండారం బయటపెడుతానన్న రేవంత్ రెడ్డి

By:  Tupaki Desk   |   16 July 2021 2:10 PM GMT
కోకాపేట భూములు: రేపు బండారం బయటపెడుతానన్న రేవంత్ రెడ్డి
X
తెలంగాణ సర్కార్ ను మరోసారి టార్గెట్ చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా కోకా పేట భూముల వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేశారు. ఆ ప్రదేశంలో రూ.60 కోట్లకు ఎకరం అమ్ముడయ్యే భూమిని కేవలం రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లకే ఎకరం అమ్మారని ఆరోపించారు. వేలం ప్రక్రియలో బయటి కంపెనీల వారు పాల్గొనకుండా అడ్డుకున్నారని అన్నారు. వేలంలో పాల్గొన్నవారంతా కేసీఆర్ బంధువులు, సన్నిహితులేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కోకా పేట భూములను తక్కువ ధరకే ఆ కంపెనీలకు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీటికి సంబంధించిన అన్ని వివరాలను రేపు బయటపెడుతానని సంచలన ప్రకటన చేశారు.

సీఎం కేసీఆర్ బంధువులు పక్క దేశాల పాస్ పోర్టులు తెచ్చుకుంటున్నారని.. ఎక్కడ దాక్కున్నా శిక్ష తప్పదని హెచ్చరించారు. అబద్దాలతో కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యాడని రేవంత్ రెడ్డి అన్నారు.

అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు.

పెట్రోల్ పన్నులతో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకున్నారని మండిపడ్డారు. పెట్రోల్ , డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన ‘చలో రాజ్ భవన్’ కార్యక్రమం సందర్భంగా ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ప్రస్తుత పెట్రోల్ ధర రూ.105లో కేసీఆర్ , మోడీ రూ.60 పన్నుల రూపంలో దోచేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెట్రో పన్నులపై అన్ని చోట్ల ప్రజలు చర్చించాలని పిలుపునిచ్చారు.