Begin typing your search above and press return to search.
వాసుపల్లి కోటలో మంత్రిగా ఆయనేనట
By: Tupaki Desk | 27 Feb 2023 3:00 PM GMTకొత్త జిల్లాల విభజనలో విశాఖకు మంత్రి పదవి దక్కలేదు. అనకాపల్లి జిల్లాకే రెండు మంత్రి పదవులు ఇచ్చారు. గుడివాడ అమరనాధ్ విశాఖ మంత్రిగానే అంతా చూసుకుంటూ వస్తున్నారు. విశాఖ మీద జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన నేపధ్యం ఉంది. రాజధానిగా చేస్తాను అంటున్నారు. అలాంటి చోట మంత్రి పదవి ఇవ్వకపోతే ఎలా అన్న చర్చ ముందుకు వస్తోంది.
అందుకే ఆ లోటుని తీర్చేందుకు తొందర్లోనే మంత్రి వర్గ విస్తరణ చేసి విశాఖ నుంచి ఒకరిని మంత్రి పదవి ఇవ్వాలని జగన్ చూస్తున్నారు. ఎమ్మెల్యేలలో చూస్తే అవంతి శ్రీనివాసరావు మంత్రి పదవి చేసేశారు. గాజువాక, పెందుర్తి నుంచి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ సామాజికవర్గం కోణం లో నుంచి ఇతరత్రా చూస్తే వారిని సైడ్ చేయాల్సిందే అంటున్నారు.
విశాఖ సౌత్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి వచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ అలా వైసీపీ వాళ్లను తీసుకుని మంత్రి పదవులు ఇచ్చింది. కానీ జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చి తప్పు చేయదలచుకోలేదు అంటున్నారు. ఇక వైసీపీలోనే ఎక్కువ మంది మంత్రి పదవి ఆశిస్తున్నారు. జగన్ వరకూ చూస్తే కొన్ని సీట్లు గెలవాలి. కొందరికి పదవులు ఇచ్చి ప్రోత్సహించాలి అన్నది అజెండాగా ఉంది.
దాంతో ఆయన ఎవరికి మంత్రి పదవులు ఇవ్వదలచుకున్నారో వారిని ఎమ్మెల్సీలుగా చేశారు. అలా వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అయిన విశాఖ సౌత్ నాయకుడు, ఏపీ ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ అయిన కోలా గురువులును మంత్రిని చేస్తారు అని అంటున్నారు. మత్స్యకార వర్గానికి ఉత్తరాంధ్రాలో మంత్రి పదవి ఇప్పటిదాకా ఇవ్వలేదు
ఆ ట్రెడిషన్ ని మార్చేసి శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సీదరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చిన జగన్ ఇపుడు అదే మత్యకారులలో వాడబలిజ శాఖకు చెందిన కోలా గురువులుకు మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఏపీలోని తీర ప్రాంతంలోని ఉమ్మడిగా ఉన్న తొమ్మిది జిల్లాలలో పలు నియోజకవర్గాలలో మత్య్సకారుల బలం ఉంది. వారి మద్దతు అవసరం. బీసీలలోకెల్లా వారు బీసీలు. అందుకే వారి మద్దతు కోసం మంత్రి పదవులు ఇవ్వడం పార్టీలకు ఆనవాయితీగా ఉంది.
తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా గోదావరి జిల్లాలను దాటి ఈ వైపు వచ్చ్చేది కాదు, ఇపుడు వైసీపీ మాత్రం ఉత్తరాంధ్రా మీద ఫుల్ ఫోకస్ పెట్టడంతో మత్యకార పదవి మళ్ళీ ఈ ప్రాంతానికే అంటోంది. దీంతో కోలా గురువులుకు అందలం దక్కుతోంది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందా లేదా అని నిన్నటిదాకా తెగ మధన పడిన గురువులుకు ఆరేళ్ళ పాటు ఏ ఇబ్బందీ లేని ఎమ్మెల్సీ పదవిని జగన్ ఇచ్చారు.
ఇపుడు మంత్రిని కూడా చేస్తున్నారు అంటే రాజకీయంగా ఆయన జాక్ పాట్ కొట్టినట్లే అంటున్నారు. సౌత్ లో వాసుపల్లిదే ఇప్పటిదాకా రాజ్యం. ఇపుడు మంత్రిగా కోలా గురువులు అయితే ఎమ్మెల్యే సైతం ఆయన వద్దకు రావాల్సిందే అంటున్నారు. ఆ విధంగా వాసుపల్లి కోటలో కోలా గురువులుని పెద్ద గీత చేస్తున్నారు.
ఆ విధంగా సొంత పార్టీ వారికి పూర్తి న్యాయం చేస్తున్నారు. దానికి బదులుగా వాసుపల్లిని గెలిపించడంతో పాటు ఉత్తరాంధ్రాలో మత్యకారులను వైసీపీ వైపుగా తిప్పే బాధ్యతను కూడా గురువులు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి పేరులోనే కాదు రాజకీయంలోనూ గురువునే అని కొద్ది రోజుల్లోనే కోలా అనిపించుకుంటున్నారని అనుచరులు సంబరపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.