Begin typing your search above and press return to search.
పూసపాటి కోటను ఢీ కొట్టేది ఆమేనా... ?
By: Tupaki Desk | 16 Nov 2021 3:30 PM GMTవిజయనగరం జిల్లా గురించి చెప్పాలి అంటే ముందుగా పూసపాటి రాజుల పేరే వినిపిస్తుంది. చరిత్రలో వారి స్థానం పదిలం. వందల ఏళ్ళు రాజ్యాలు ఏలారు. తమకు తిరుగులేదని చాటారు. సంస్థానాలకు అధిపతులుగా తమ మాటే శాసనంగా జీవించారు. పూసపాటి రాజులు తరువాత కాలంలో ప్రజాస్వామ్య యుగంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పీవీజీ రాజుతో మొదలుపెడితే ఆనందగజపతిరాజు, అశోక్ గజపతిరాజు కూడా ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. అశోక్ ఈ రోజుకీ క్రియాశీలకంగానే ఉన్న్నారు. విజయనగరం తెలుగుదేశం పార్టీకి ఆయనే పెద్ద దిక్కు అని కూడా చెప్పాలి.
వచ్చే ఎన్నికల్లో అశోక్ మళ్ళీ పోటీ చేస్తారు అన్న టాక్ ఉంది. తనతో పాటు కుమార్తెకు కూడా ఆయన టికెట్ అడుగుతున్నారు. మరో వైపు వైసీపీకి ఈసారి విజయనగరం జిల్లాలో ఎన్నికలు గట్టి సవాల్ గా మారనున్నాయి. ముఖ్యంగా అశోక్ ని గతసారి ఓడించిన కోలగట్ల వీరభద్రస్వామి ఈసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేసే చాన్స్ అయితే లేదు. పైగా ఆయన పోటీ నుంచి తప్పుకుని కుమార్తె శ్రావణికి టికెట్ అడుగుతున్నారు. ఆమె ఎంతవరకూ పూసపాటి వారి హవాను నిలువరించగలదు అన్నది సందేహమే. దీంతో రాజుల కోటలో నుంచే మరొకరిని తెచ్చి గట్టి పోటీ ఇవ్వాలన్న ఆలోచన అయితే వైసీపీ అధినాయకత్వానికి ఉంది అంటున్నారు. దానికి తగిన వ్యక్తిగా సంచయితను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.
ఆనందగజపతి రాజు మొదటి భార్య కుమార్తెగా సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఏడాది పాటు పాలన చేసి ఏపీ స్థాయిలోనే అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆమెను ఆరు నెలల క్రితం న్యాయ స్థానం తొలగించి బాధ్యతలను తిరిగి అశోక్ కి అప్పగించింది. దాంతో ఆమె ఇపుడు ఖాళీగా ఉన్నారు. కోర్టులో ఈ విషయాన్ని చాలెంజి చేసి మళ్ళీ పదవిలోకి వస్తాను అని తొలినాళ్లలో ఆమె చెప్పినా అదంత సులువుగా అయ్యే పనిలా కనిపించడంలేదు. ఆమె ఇప్పటికీ వైసీపీ సానుభూతిపరురాలిగా ఉంటున్నారు. ఆమెను అడ్డం పెట్టుకుని అశోక్ ను కొన్నాళ్ల పాటు రాజకీయంగా ఇబ్బందులు పెట్టిన వైసీపీ పెద్దలు అయితే ఏదో ఒక పదవి ఇచ్చి సంచయితకు న్యాయం చేయాలని కూడా భావిస్తున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక బేసికల్ గా చూస్తే సంచయిత బీజేపీ మెంబర్ గా ఉన్నారు. అయితే ఏపీలో బీజేపీకి పెద్దగా సీన్ లేదు, దాంతో ఆమె వైసీపీలో చేరి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లుగా చెబుతున్నారు. సంచయిత తలచుకోవాలే కానీ వైసీపీ అధినాయకత్వం కూడా ఆమెకు పచ్చ జెండా ఊపడం ఖాయం. ఆమెను ఈసారి విజయనగరం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలు కూడా హై కమాండ్ కి ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అశోక్ పోటీ చేసినా, ఆయన కుమార్తె అతిధి పోటీలో ఉన్నా వైసీపీ నుంచి సంచయితను బరిలో నిలపాలన్నది పార్టీ పెద్దల ఆలోచన అంటున్నారు. అదే కనుక జరిగితే బాబాయ్ వర్సెస్ అమ్మాయి గా రానున్న ఎన్నికల్లో రాజకీయ సమరం రంజుగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇక తనను పూసపాటి వారి ఫ్యామిలీ లో భాగంగా చూడని బాబాయ్ మీద సాధించాలని చూస్తున్న సంచయితకు కూడా ఈ పోరు బహు ఇష్టంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి విజయనగరం కోట చుట్టూ అధికార పార్టీ రాజకీయాలు మరో మారు జోరుగా తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.