Begin typing your search above and press return to search.
లోధా ఎంత ముదురు కేసంటే..
By: Tupaki Desk | 23 Dec 2016 4:58 AM GMT‘‘పరామస్ మల్ లోధా’’ పేరు కొద్దిమందికి మాత్రమే తెలుసు. కోల్ కతాలో సుపరిచితమైన ఈ పేరు దక్షిణాది ప్రజలకు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. కానీ.. తమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్ కమ్ టీటీడీ మాజీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డికి చెందిన పాతనోట్లకు కొత్తనోట్లను ఏర్పాటు చేసిన ఉదంతంలో సాక్ష్యాలతో దొరికిపోయి పోలీసులు అరెస్ట్ చేయటంతో.. ఇతగాడి పేరు ఇప్పుడు ప్రముఖంగా మారింది.
ముంబయి ఎయిర్ పోర్ట్ లో అధికారులు లోధాను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇతగాడు ఎవరు? ఇతని కథేమిటి? అన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. డబ్బుతో తన సర్కిల్ ను విపరీతంగా పెంచుకున్న ఇతను వివాదాలతో సహజీవనం చేస్తుంటారని చెబుతుంటారు. మొదటి నుంచి తేడాగాడిగా.. వివాదాస్పద ప్రముఖుడిగా పేరున్న ఇతగాడి గురించి చెప్పాల్సివస్తే..
= దేశంలోనే అతి పెద్దదైన నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ పీర్ లెస్ సహా ఏడు కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు లోధా. ఈ సమయంలో పీర్ లెస్ ను సొంతం చేసుకునేందుకు పెద్ద ఎత్తున పావులు కదిపాడు. కానీ.. వర్క్ వుట్ కాలేదు. ఈ ఎపిసోడ్ లోనే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా రంగంలోకి దిగి.. పీర్ లెస్ ఛైర్మన్ పీసీ సేన్ ను బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి.
= లోధాకు చాలానే బిజినెస్ లు ఉన్నాయి. గనులు.. కన్సెల్టెన్సీ.. రెస్టారెంట్లు.. ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటారు.
= కోల్ కతాలోని బిగ్ షాట్స్ తో ఇతనొకడు. ఇతడెంత సౌండ్ పార్టీ అంటే దేశ రాజధాని ఢిల్లీలో 150 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో విలాసవంతమైన భవనం ఉంది.
= రెండేళ్ల క్రితం ఈ భవనంలోనే లోధా రెండో కుమార్తె పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడకులకు పేరు మోసిన రాజకీయ నేతలు మొదలు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. చివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా హాజరు కావటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పెళ్లికి వచ్చే అతిధుల కోసం లీలా ప్యాలెస్.. ఐటీసీ మౌర్య హోటళ్లలో గదుల్ని బుక్ చేశారు.
= ఆరున్నరేళ్ల క్రితం కోల్ కతా నడిబొడ్డున ఉన్న పార్క్ స్ట్రీట్ లోని స్టీపెన్ హౌస్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనం ఐదు.. ఆరు అంతస్థుల్లో చెలరేగిన మంటల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భవన యజమాని ఎవరో కాదు.. పరామస్ లోధా. అనుమతి లేకుండా నిర్మించిన ఈ అంతస్తులో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఆయనకు ఎక్స్ ట్రా ఫ్లోర్స్ లోధా అన్న పేరు వచ్చింది. అయినప్పటికీ అలాంటివి ఆయన పెద్దగా పట్టించుకోరనే చెప్పాలి.
= మూడేళ్ల క్రితం (2013)లో ఆయన పెద్ద కుమార్తె పెళ్లి రాజస్థాన్లోని ఉదయ్ పూర్ లో జరిగింది. ఈ పెళ్లి కోసం వచ్చే అతిధుల్ని తరలించటం కోసం ఆయన ఏకంగా 22 ప్రైవేట్ జెట్లను ఉపయోగించి సంచలనం సృష్టించాడు. తాజాగా రద్దు అయిన పాత నోట్లను కొత్త నోట్లలోకి మార్చిన ఉదంతంలో అరెస్ట్ అయ్యారు. చేసిన పాపాలు ఒకసారి కాకుంటే ఒకసారి అయినా పండక మానవు కదా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/