Begin typing your search above and press return to search.

న‌గ‌రంలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా కౌగిలింత‌లే

By:  Tupaki Desk   |   4 May 2018 7:18 AM GMT
న‌గ‌రంలో ఇప్పుడు ఎక్క‌డ చూసినా కౌగిలింత‌లే
X
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌క‌తాలో ఇప్పుడు కౌగిలింత‌లు కామ‌న్ అయిపోయాయి. ఇలా చేస్తోంది యువ‌త‌. ఎందుకంటే...నిర‌స‌న‌లు. కోల్‌కతా మెట్రో రైల్లో సోమవారం రాత్రి ఓ సంఘటన చోటు చేసుకోవ‌డం మీకు గుర్తుండే ఉంటుంది. మెట్రో రైలు బోగీలో ఓ జంట‌ పబ్లిగ్గా కౌగిలించుకోవడంతో ఆ జంటను తోటి ప్రయాణికులు చితకబాదారు. ఓ స్టేషన్లో వారిని కిందకు లాగేసి యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు. ప్రయాణికుల ఆగ్రహం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే ఈ ఘటనకు నిరసనగా ఇప్పుడు కోల్ కతాలో ఎక్కడ చూసిన కుర్రకారు కౌగిలింతలే కనిపిస్తున్నాయి.

సిటీలోని అన్ని మెట్రో స్టేషన్ల దగ్గర - కాలేజీలు - కాపీ డేలు - రెస్టారెంట్లలో ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లోనే యువత హగ్ చేసుకుంటూ తమ నిరసన తెలుపుతున్నారు. ఏ ఇద్దరు కలిసినా హగ్ చేసుకుని మరీ విషెస్ చెప్పుకుంటున్నారు.మెట్రో స్టేషన్ల దగ్గర రండి.. హగ్ చేసుకుందాం.. అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్లకార్డులతో హోరెత్తించారు. హగ్ అనే ఆప్యాయత, అనురాగానికి సంబంధించిన విషయం అని.. దాన్ని అసభ్యకరంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్ యూనియన్స్, కుర్రకారు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కోల్ కతా మెట్రో స్టేషన్ లో జరిగిన దాడిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హగ్ అనేది ఆయా వ్యక్తుల రిలేషన్ షిప్ పై ఆధారపడి ఉంటుందని.. దాన్ని ఎక్కువ చేసి చూడటం అనేది సిగ్గుచేటు అంటూ స్టూడెంట్స్ లెక్చర్స్ ఇచ్చేస్తున్నారు. లక్షల మంది స్టూడెంట్స్ చేస్తున్న ఈ కౌగిలింతల ఉద్యమాన్ని పోలీసులు చూస్తూనే ఉన్నారు.. ఏ మాత్రం యాక్షన్ తీసుకోవటం లేదు. ఏదైనా శృతిమించకుండా ఉండాలని యువతను పోలీసులు కోరుతున్నారు.

కాగా, ఈ ఉదంతంపై చారిత్రక కోల్‌ కతా నగరం రెండు వర్గాలుగా విడిపోయింది. కొంత మంది ఈ యువ జంట చర్యను తప్పుబడుతుండగా.. మరికొంత మంది ఆటవిక ఆలోచనల నుంచి బయటపడాలని వృద్ధులపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.