Begin typing your search above and press return to search.

మహిళల్ని నరికేయండి..సీనియర్ నటుడి కామెంట్

By:  Tupaki Desk   |   14 Oct 2018 9:46 AM GMT
మహిళల్ని నరికేయండి..సీనియర్ నటుడి కామెంట్
X
శబరిమల మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పవిత్ర శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దరిమిలా సంప్రదాయ వాదులు, కేరళ వాసులు ఆందోళనలు తీవ్ర తరం చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే ఒక్కరొక్కరు దీని పై గళమెత్తుతున్నారు.

తాజాగా మలయాళ సీనియర్ నటుడు కొల్లాం తులసి సంచలన కామెంట్స్ చేశారు. శబరిమల దేవాలయంలోకి అడుగుపెట్టే మహిళలను నిలువునా చీల్చేయండి అంటూ దారుణ పదజాలం వాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఈ సీనియర్ నటుడు ఈ హాట్ కామెంట్ చేశారు..

శబరిమలలోకి వెళ్లిన మహిళల్ని రెండుగా చీల్చి ఒకటి ఢిల్లీలో పడేయాలని.. మరొకటి కేరళలోని సీఎం రూమ్ లో పడేయాలంటూ కొల్లాం తులసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. దీనిపై మహిళ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.