Begin typing your search above and press return to search.

చూశారా కొల్లు నోటి నుంచి కొత్త డిమాండ్‌?

By:  Tupaki Desk   |   24 Jun 2015 10:18 AM GMT
చూశారా కొల్లు నోటి నుంచి కొత్త డిమాండ్‌?
X
ఓటుకు నోటు వ్యవహారంతో మొదలైన లొల్లి ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పవర్‌ ఫైట్‌ గా మారిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలోని సెక్షన్‌ 8అమలుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు వేర్వేరు వాదనలు వినిపించటం తెలిసిందే. ఎవరి రాజకీయప్రయోజనాలు వారివి అన్న చందంగా వ్యవహరిస్తున్నారే తప్పించి.. ప్రజలను దృష్టిలో పెట్టుకున్నట్లుగా వారి వైఖరిని కనిపించని పరిస్థితి.సెక్షన్‌ 8 అమలుకు సంబంధించి రెండు రాష్ట్ర అధికారపక్ష నేతలు పోటాపోటీగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర నోటి నుంచి వచ్చిన ఒక డిమాండ్‌ భవిష్యత్తు వివాదానికి తొలి మెట్టుగా మారింది.

సెక్షన్‌ 8 పంచాయితీనే సెగలు పొగులు పుట్టిస్తుంటే.. అంతకు మించిన అంశాన్ని తాజాగా కొల్లు తెరపైకి తీసుకురావటం గమనార. సెక్షన్‌ 8 అమలు కుదరదని అంటే.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని తాము కేంద్రాన్ని కోరతామంటూ ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు.

ఉమ్మడి రాజధానిగా ఇద్దరికి పదేళ్ల పాటు హైదరాబాద్‌ మీద అధికారాలు ఉన్నాయని.. రాజధానిలో శాంతిభద్రతల విషయంలో గవర్నర్‌కు పూర్తి అధికారం ఉందన్న కొల్లు.. రాబోయే రోజుల్లో.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా (యూటీ) మార్చాలన్న డిమాండ్‌పై మరింత స్వరం పెంచేలా చేస్తాన్న మాటను చెప్పటం గమనారÛం. సెక్షన్‌ 8కే ఇంత రచ్చ జరుగుతుంటే.. యూటీ అన్న డిమాండ్‌ మరింత మంట పుట్టించటం ఖాయం. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సింది పోయి.. ఇలా ఆవేశకావేశాలు రగిల్చేలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. రాజకీయ అధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న నేతలకు.. ప్రజల అభివృద్ధి మీద దృష్టి సారించేంత పెద్ద మనసు ఉంటుందా?