Begin typing your search above and press return to search.

భజ‌న మీడియా కూడా బాబును దులిపేసిందే

By:  Tupaki Desk   |   7 Oct 2017 4:29 AM GMT
భజ‌న మీడియా కూడా బాబును దులిపేసిందే
X
నిజం నిప్పులాంటిది! రాష్ట్రంలో జ‌రుగుతున్న అక్ర‌మాలు - సీఎం చంద్ర‌బాబు పాల‌నా వైఫ‌ల్యాలు అన్నీ ఇన్నీకావు. అదికారం చూసుకుని త‌మ్ముళ్లు ప్ర‌జ‌ల‌ను దోచేస్తున్నారు. అనేక ప‌థ‌కాల‌ను అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా వెనుకేసుకుంటున్నారు. అవినీతి 200% పెరిగిపోయింది. ఉపాధి దొర‌క్క ప్ర‌జ‌లు వ‌ల‌స బాట ప‌డుతున్నారు. బాబు చెబుతున్న దానికీ చేస్తున్న దానికీ సంబంధమేలేదు. ప్ర‌చారం కోసం బాబు ప‌డుతున్న పాట్లు అన్నీ ఇన్నీకావు! ప్ర‌జ‌ల‌కు బాబు ఇచ్చిన హామీలు బ‌ట్ట‌దాఖ‌ల‌వుతున్నాయి. జ‌నాలు అలో ల‌క్ష్మ‌ణా అని విల‌పిస్తున్నారు. పాల‌న‌లో నిజాయితీ లేద‌ని త‌పిస్తున్నారు. ఇలాంటి అంశాల‌పై విప‌క్షానికి చెందిన ప‌త్రిక సాక్షి ఎప్ప‌టిక‌ప్పుడు నిజాల నిగ్గు తేలుస్తూ వార్త‌లు ప్ర‌జ‌ల‌కు అందిస్తోంది.

అయితే, బాబు అండ్‌ కో మాత్రం ప‌క్ష‌పాతంతో రాస్తున్నార‌ని - ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని బాహాటంగా పిలుపునిస్తున్నారు. రాష్ట్ర అభివృద్దికి వైసీపీ అడ్డు ప‌డుతోంద‌ని ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టారు. అయితే, నిజం నిప్పులాంటిది కాబ‌ట్టి.. బాబు త‌న త‌ప్పుల‌ను - త‌న త‌మ్ముళ్ల దోపిడీని ఎంత దాచాల‌న్నా దాగ‌లేదు. కాగ్ రూపంలో కొర‌డా ఝ‌ళిపించింది. దీంతో నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. రాష్ట్రంలో బాబుకు భ‌జ‌న ప‌త్రిక‌లుగా పేరు ప‌డ్డ వాటిలోనూ బాబు అక్ర‌మాల సంగ‌తి రాయ‌క‌త‌ప్ప‌లేదు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన వైసీపీ అధికార ప్ర‌తినిధి - మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి ``మ‌రి ఇప్పుడేమంటారు?`` అని బాబును నిల‌దీశారు.

శుక్రవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. ‘ఉపాధి హామీ పనులను వైఎస్‌ ఆర్‌ సీపీ ఎంపీలు అడ్డుకుంటున్నారనేది అవాస్తవం. ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. టీడీపీ నేతల జేబులు నింపడం కోసమే...ఉపాధి హామీ పనులను యంత్రాలతో చేయిస్తున్నది వాస్తవం కాదా?. మేం పేదల తరఫున మాట్లాడితే అభివృద్ధికి అడ్డుపడినట్లా?. ప్రభుత్వం చేస్తున్న అవకతవకలు బయటపెడితే మాపై నిందలా?. మీకు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండి. లేదా జ్యుడీషియల్‌ ఎంక్వైరీ చేయించండి’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ సంద‌ర్భంగానే.. కాగ్ రిపోర్ట్ కూడా వైఎస్‌ ఆర్‌ సీపీ రాసిందని చెబుతారా..? అంటూ ధ్వజమెత్తారు. 2016కు సంబంధించిన ఉపాధి హామీ పనుల్లో 350 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని బాబు భ‌జ‌న ప‌త్రి ఈనాడులో వచ్చిన వార్తను మీడియా ముఖంగా పార్థసారధి చూపించారు. వాళ్లు రాస్తే ఏమనిపించదు గానీ...తాము ఆ తప్పుల్ని ఎత్తిచూపితే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని పాట పాడతారా..? అని సూటిగా ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో పదిలక్షల మంది వలస వెళ్లారని పత్రికల్లో వస్తుంటే దాన్ని ఆపేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని చంద్రబాబును నిలదీశారు. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో జగన్‌ నిలదీశారని పార్థసారధి గుర్తు చేశారు. మొత్తానికి ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ప్ర‌భుత్వ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌రి ఏం స‌మాధానం వ‌స్తుందో చూడాలి.