Begin typing your search above and press return to search.
కొలుసు సవాల్.. బాబు రిజైన్ చేయాలి
By: Tupaki Desk | 19 Sep 2017 7:06 AM GMTసదావర్తి సత్రం భూముల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగా బుక్కయిపోయిన విషయం ఒక్క ఏపీలోనే కాదు.. చుట్టు పక్కల రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అత్యంత విలువైన భూములను తన అనుయాయులకు కారు చౌకకు కట్టబెట్టడం.. దీనిని పసిగట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సహా పార్టీ నేతలు ఈ విషయంలో బాబును ఏకేయడం. చివరికి న్యాయస్థానం జోక్యంతో బాబు బండారం బట్టబయలు కావడం తెలిసింది. ఫలితంగా ఇప్పుడు రూ.60 కోట్లకు పైచిలుకు ధర పలికాయి సత్రం భూములు. దీంతో రాష్ట్ర ఖజానాకు దాదాపు 40 కోట్ల మేరకు అదనపు లబ్ధి చేకూరింది. నిజానికి ఇదంతా వైసీపీ నేతల పట్టుదలతోనే సాధ్యమైంది. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదని వైసీపీ ముక్కుమీద గుద్ది మరీ చెప్పినట్టయింది.
అయితే, ఇంతగా ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతూ.. అదే ప్రభుత్వం ఆర్థికంగా బలపడేలా వ్యవహరించిన వైసీపీ నేతలకు అన్ని చోట్ల నుంచి వెరీగుడ్ - శభాష్ - విపక్షం అంటే ఇలా ఉండాలి. అనే కామెంట్లు వినిపిస్తుంటే.. టీడీపీ మంత్రులు - నేతలు మాత్రం దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పదేపదే ప్రయత్నిస్తున్నారు. దేవుడి భూములను భూంఫట్ చేసిన విషయం బయటపడడంతో ప్రజలు ఎక్కడ తిరగబడతారోనని బెంబేలెత్తుతున్నారు. ఇక, వైసీపీ సాధించిన విజయంపై ఆ పార్టీ సీనియర్ నేత - అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి స్పందించారు. సదావర్తి సత్రం భూముల వేలం విషయంలో తమ పార్టీ చెప్పిందే నిజమైందని అన్నారు.
సీఎం చంద్రబాబు తన మనుషులకు కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు చేసిన కుట్ర బయటపడిందని నిప్పులు చెరిగారు. దేవుడి భూములనే దోచేయాలని పన్నాగం పన్నారని, దీనిపై వైసీపీ పోరాటం ఫలితంగా నేటి వేలం పాట జరిగిందని చెప్పారు. దీంతో ప్రభుత్వ అవినీతి బట్టబయలైందన్నారు. ఈ వేలం ద్వారా అక్రమాలు బయటపడితే సిగ్గుపడాల్సింది పోయి, స్వాగతిస్తున్నామని టీడీపీ మంత్రి సోమిరెడ్డి అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఒక మంత్రిగా ఉండి అవినీతిని స్వాగతిస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతికత ఉన్నా.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సదావర్తి భూముల వేలంలో కుట్ర కోణంపై విచారణకు ఆదేశించాలన్నారు. మరి కొలుసు సవాలును బాబు స్వీకరిస్తారా? పదవికి రాజీనామా చేస్తారా? చూద్దాం. ఎలా రియాక్ట్ అవుతారో.