Begin typing your search above and press return to search.
నల్లగొండ విషయాలు నాకన్నా ఎక్కువ తెలుసా?
By: Tupaki Desk | 30 April 2022 2:30 PM GMTకాంగ్రెస్‌లో వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడడం లేదు. మేలో పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ వరంగల్‌లో సభ నిర్వహించి.. పార్టీ పునరుత్తేజానికి ప్రయత్నించనున్నారు. దీనిని సక్సెస్ చేసేందుకుపార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ ప్రయత్నిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ పర్యటించి.. పార్టీ నేతలను వరంగల్‌కు తరలించేలా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ పర్యటనలపై పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ.. కోమటి రెడ్డి వెంకట రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక్కరే ప్రజలను తరలిస్తారా? అంటూ.. కారాలు మిరియాలు నూరారు.
రాహుల్ గాంధీ సభ నిర్వహించబోయే వరంగల్ జిల్లాకు సమీపంలోని మండలాలను, పక్క జిల్లాలను కలుపుకుని జన సమీకరణకు రేవంత్ వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి సభ విజయవంతంపైన దిశానిర్దేశం చేసారు కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కూడా రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించారు. వరంగల్ కు యాభై కిలో మీటర్లు, వంద కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాల నుండి జనాలను ఎలా తరలించాలనే అంశంపై పార్టీ నేతలతో చర్చించారు.
ఇదీ అభ్యంతరం..
రాహుల్ సభకు జనసమీకరణలో భాగంతో కోమటిరెడ్డి సొంత జిల్లా నల్లగొండ జిల్లాలో కూడా పర్యటించాలని రేవంత్ భావించారు. అయితే, రేవంత్ రెడ్డి పర్యటన నల్లగొండ జిల్లాలో అవసరం లేదని ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తేల్చిచెప్పారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, అద్యక్షుడు పర్యటించి బలోపేతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. రాహుల్ గాంధీ సభకు నల్లగొండ జిల్లా నుండి ఎంతమంది జనాన్ని తరలించాలో తనకు తెలుసనని ఆయన వ్యాఖ్యానించారు.
``నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతంగా ఉంది, టీపిసిసి అద్యక్షుడు పర్యటించి కార్యకర్తల్లో ఉత్తేజం నింపాల్సిన అవసరం లేదు`` అని కోమటి రెడ్డి స్పష్టం చేశారు. ఇది రాజకీయంగా వివాదానికి దారితీసింది. రాష్ట్ర పార్టీ అద్యక్షుడి పర్యటన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడం, ఉచిత సలహాలు ఇవ్వడం కోమటి రెడ్డికి తగదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పార్టీ అద్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఏ ప్రాంతంలోనైనా పర్యటించే స్వేచ్చ ఉందని, బలం బలహీనతల అంశం పరిగణలోకి రాదని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. కోమటి రెడ్డి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం మానుకొని టీపీసీపీ నిర్ణయానికి గౌరవం ఇవ్వాలని.. అంటున్నారు.
మరోవైపు.. కోమటి రెడ్డి.. రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన పట్ల చేసిన వ్యాఖ్యలను కొందరు పార్టీ అధిష్టానానికి పంపించారు. ఈ వ్యాఖ్యల పట్ల అధిష్టానం సీరియస్ అయినట్టు సమాచారం. కోమటి రెడ్డి ఏం మాట్లాడారు, అద్యక్షుడి పర్యటన పట్ల ఎలా స్పందించారో తెలుసుకునేందుకు కోమటిరెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
గత నెలలో పార్టీ ముఖ్యనేతలను ఢిల్లీ పిలుపించుకుని రాహుల్ గాంధీ దిశానిర్ధాశం చేసినప్పటికి ఎందుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయనే కోణంలో అధిష్టానంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి.. కోమటిరెడ్డి విషయం అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.