Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి దొంగ.. దొంగతనాలు చేసేవాడు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

By:  Tupaki Desk   |   5 Sep 2022 5:33 AM GMT
రేవంత్ రెడ్డి దొంగ.. దొంగతనాలు చేసేవాడు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటలు కట్టుదాటుతున్నాయి. మొన్నటివరకూ కాంగ్రెస్ లోనే ఉన్న రాజగోపాల్ రెడ్డి తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పట్టుకొని దొంగ అని సంబోధించడం కలకలం రేపింది. ఈ మాటలు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

మొన్నటివరకూ కాంగ్రెస్ లోనే ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీలోకి మారగానే కాంగ్రెస్ పార్టీపైనా.. నేతలపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ పార్టీ నట్టేట మునగడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెబుతున్నారు.

తనపై విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డికి చరిత్ర లేదన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు చోరీలు చేసేవారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముందు రేవంత్ రెడ్డి ఫొటో.. వెనుకాల చంద్రబాబు ఫొటో ఉందని ఆరోపించారు. ఇక తాను రాజకీయాల్లోకి వచ్చాక సొంత ఆస్తులు అమ్ముకున్నానని తెలిపారు. డబ్బు కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. అది ఎవరో తెలుసు అన్నారు.

రేవంత్ రెడ్డి ఈ కేసులో జైలుకు పోయారో గుర్తుంచుకోవాలని అన్నారు. ఎవరెవరు ఎన్ని ఆస్తులు సంపాదించారో చర్చిద్దామా? అంటూ కోమటిరెడ్డి సవాల్ చేశారు. ఇది మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నిక అన్నారు. రాజగోపాల్ రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదన్నారు. ఇది ఒక యజ్ఞం అని.. ఒక ధర్మయుద్ధం అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో కుటుంబ పాలనను బొందపెట్టాలని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. డబ్బు సంచులతోనే టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

మునుగోడులో ఈసారి గెలిచేది ప్రజలేనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బుకు అమ్ముడుపోరని ధీమా వ్యక్తం చేశారు. డబ్బు సంచులు.. పెన్షన్లు, గొర్రెలు ఇలా ఎన్ని ప్రలోభాలు చేసినా మునుగోడు ప్రజలు అమ్ముడుపోరన్నారు. టీఆర్ఎస్ కు చరమగీతం పాడుతారని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.