Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ కు షాక్..కోమటిరెడ్డి - సంపత్ సేఫ్

By:  Tupaki Desk   |   4 Jun 2018 6:14 AM GMT
టీఆర్ ఎస్ కు షాక్..కోమటిరెడ్డి - సంపత్ సేఫ్
X
అనుకున్నట్టే అయ్యింది. టీఆర్ ఎస్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్ కుమార్ లకు హైకోర్టులో ఊరట లభించింది. టీఆర్ ఎస్ వేసిన పిటీషన్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కోమటిరెడ్డి - సంపత్ లు నిషేధం తొలిగిపోయి ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి - సంపత్ లు గవర్నర్ ప్రసంగించినప్పుడు అనుచితంగా ప్రవర్తించారు. మైక్ లు - హెడ్ సెట్ లు విసిరి నానా బీభత్సం సృష్టించారు. దీంతో వీరి సభ్యత్వ రద్దు చేస్తూ తెలంగాణ శాసనసభ నిర్ణయం తీసుకుంది. దీనిపై కోమటిరెడ్డి - సంపత్ లు హైకోర్టుకు వెళ్లగా సింగిల్ బెంచ్ వీరి సభ్యత్వ రద్దును కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ 12మంది టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంజ్ లో అప్పీల్ చేశారు.

అయితే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల పిటీషన్ ను హైకోర్టు తాజాగా తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ జడ్జీ తీర్పును సమర్ధించింది. కోమటిరెడ్డి - సంపత్ లకు రాజకీయ దురుద్దేశంతో అనర్హత వేటు వేశారని వాళ్ల తరఫు న్యాయవాది హైకోర్టు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వాదనకే జై కొట్టిన డివిజన్ బెంచ్ టీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ వారి శాసనసభ్యత్వం రద్దు కాదని.. వారు ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని తీర్పునిచ్చింది.