Begin typing your search above and press return to search.
దమ్ము + సొమ్ము ఉన్న నేతలు కావలెను!
By: Tupaki Desk | 10 Nov 2016 2:57 AM GMTతాజాగా ఒక జాబ్ నోటిఫికేషన్ రాజకీయవర్గాల్లో హల్ చల్ చేస్తుంది. సర్విస్ కమిషన్స్ తీసే నోటిఫికేషన్లకు తక్కువలో తక్కువ 1:1000 లెక్కల్లో అభ్యర్థులు ఉంటారనేది తెలిసిన విషయమే. అయితే ఈ జాబ్స్ కి మాత్రం అభ్యర్థులే దొరకడం లేదట. దీంతో హేడ్ ఆఫీసులోని పెద్దలంతా సీరియస్ గా ఈ విషయంపై ఆలోచిస్తున్నారట. ఈ పోస్ట్ కి కావాల్సిన కనీస అర్హతలు... దమ్ము + సొమ్ము! ఈ నోటిఫికేషన్ గురించి వింటుంటే... ఏదో "బలమైన" పోస్టింగ్ నోటిఫికేషన్లే పడుతున్నాయనిపిస్తోంది కదా! అవును... ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో ఈ జాబ్ ఆఫర్ గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకూ ఆఫీసు పేరు చెప్పనేలేదు కదా... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ!!
అవును... తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి! ఈ మేరకు ఇప్పటికే అధిష్ఠానం కొత్త వెతుకాలట ప్రారంభించిందట! అధికారపక్షానికి ప్రజామద్దతు తగ్గుతుందనే సంకేతాలు వస్తున్నప్పటికీ ఆ విషయాన్ని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ సిద్దహస్తులైన నాయకులు ఆ తెలివి తేటలతోపాటు దమ్ములు, సొమ్ములు పుష్కలంగా ఉన్న నేతలు టి. కాంగ్రెస్ ని బలోపేతం చేసేందుకు తీసుకురావడానికి అధిష్ఠానం ప్రయత్నిస్తోందట! ఈ విషయంలో పీసీసీ పీటంతోపాటు, మొత్తం కమిటీనే ప్రక్షాళన చేయాలని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది!!
వైఎస్సార్ మరణానంతరం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే! అనంతరం పార్టీని దమ్ముతో నడిపే నాయకుడి వందేళ్ల అనుభవం ఉన్న పార్టీకి దొరకలేదనే చెప్పాలి. వీటిలో ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి మరీ అంతంతమాత్రంగానే ఉందని చెప్పాలి! మీడియాలో మాట్లాడే నాయకులే ఎక్కువ, ప్రజల్లోకి వెళ్లే నేతలు తక్కువ! తెరాసకు వెళ్లిపోయిన వారి సంగతి కాసేపు పక్కనపెట్టి... ప్రస్తుతానికి పార్టీలో ఉన్న వారి సంగతి ఒకసారి చూస్తే... మూలుగుతున్న నక్కపై తనవంతుగా తాటిపండ్లు పడేయడం జానారెడ్డికి నిత్యకృత్యం అయిపోయింది.. ఉన్నంతలో అధికారపక్షంపై కాంగ్రెస్ చిన్నసైజు పోరాటం చేపట్టగానే, కేసీఆర్ ను ఆయన తనదైన శైలిలో పొగిడేస్తారు! దీంతో సొంతపార్టీ నేతలు ఇరుకున పడతారు. మరో సీనియర్ నేత వి. హనుమంత్ రావు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాలకే తప్ప విధానపరంగా పార్టీకి పనికిరావడం లేదని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటారు. వారి సంగతి అలా ఉంచితే... ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పరిస్థితి.. వన్ మ్యాన్ "ఆర్మీ"! ఆయనకు వెన్నుదన్నుగా నిలిచేవారు ఎంతమంది ఉన్నారన్నది ఆయనతో పాటు అందరికీ తెలిసిన విషయమే!
అయితే, ఇదే తరుణంలో కోమటిరెడ్డి సోదరులు పార్టీకి పునర్వైభవం తెస్తామనీ, పీసీసీ పీఠం తమకు ఇవ్వాలని అధిష్టానానికి అప్లై చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఢిల్లీ పెద్దలు కోరుకుంటున్న దమ్ముతోపాటు అన్నీ తమకు ఉన్నాయనే సంకేతాలు ఇప్పటికే హస్తినాపురానికి పంపేశారని చెప్పుకుంటున్నారు. వస్తోన్న కథనాల ప్రకారం తెలంగాణ పీసీసీలో మార్పులు చేయాల్సి వస్తే.. ఆ బాధ్యతలు తమకు ఇస్తే.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేవరకూ శ్రమిస్తామని చెబుతున్నారట! మరి వీరి అప్లికేషన్ ను అదిష్టానం పరిశీలిస్తుందా.. టి.కాంగ్రెస్ లో కొత్త టీం ఏర్పడుతుందా.. గెడ్డం పెంచుతున్న ఉత్తం కు విశ్రాంతి ఇస్తుందా.. ఏమి జరగబోతుందో వేచి చూడాల్సిందే!!