Begin typing your search above and press return to search.

తేడావ‌స్తే...టీఆర్ ఎస్‌ లోకి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌

By:  Tupaki Desk   |   26 Sep 2018 5:46 PM GMT
తేడావ‌స్తే...టీఆర్ ఎస్‌ లోకి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌
X
తెలంగాణ రాజ‌కీయాల్లో జంపింగ్‌ ల ప‌ర్వం జోరుగా కొనసాగుతున్నాయి. ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి నేత‌లు చాలా సుల‌భంగా మారిపోతున్నారు. నిన్న‌టివ‌ర‌కు విస్మ‌రించిన విధానాలే...ఇక‌నుంచి త‌మ‌కు శిరోధార్య‌మ‌ని భావిస్తూ రాజ‌కీయ భ‌విష్య‌త్ వెతుక్కుంటున్నారు. ఈ ఒర‌వ‌డిలో ప్ర‌ధానంగా చేరిక‌లు టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌ లోకి..కాంగ్రెస్‌ లోకి టీఆర్ ఎస్‌ లోకి జ‌రుగుతున్నాయి. ఈ చేరిక‌ల ప‌ర్వంలో తాజా అప్‌ డేట్‌..కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కారెక్క‌డం. ఈ వార్త ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ...అంత‌ర్గ‌త ప‌రిణామాలు అలాగే సాగుతున్నాయ‌ని కాంగ్రెస్ రాజ‌కీయాల గురించి తెలిసిన నాయ‌కులు అంటున్నారు.

తాము ఆశించిన ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డం - రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను క‌మిటీల రూపంలో అంద‌లం ఎక్కిస్తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ ఆర్సీ కుంతియాపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల కమిటీల నియామకాన్ని తప్పుబట్టడమే కాకుండా ప్రజల కోసం కష్టపడే నేతలకు టిక్కెట్లు ఇస్తేనే పార్టీ గెలుస్తుందని.. గాంధీభవన్‌ లో ప్రెస్‌ మీట్లు పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ అధికారంలోకి రాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్‌ గా స్పందించిన టి.కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కానీ గడువు ముగిసింది. ఆయన ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం కూడా సీరియస్‌ గా ఉన్నట్లు - ఆయనపై వేటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది.

దీనికి కొనసాగింపుగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆస‌క్తి చూపిస్తున్న మునుగోడు సీటును మ‌హాకూట‌మి పొత్తులో భాగంగా ఇత‌ర పార్టీల‌కు క‌ట్ట‌బెట్టి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ కు షాకివ్వాల‌ని పీసీసీ ముఖ్య‌నేత‌లు భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓవైపు ప‌ద‌వి ఇవ్వ‌కుండా అదే స‌మ‌యంలో వేటు వేసే ఎత్తుగ‌డ‌లు వేస్తూ...మ‌రోవైపు తాము కోరిన సీటుకు కూడా నో చెప్తున్న క్ర‌మంలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ టీఆర్ ఎస్‌ పార్టీవైపు కూడా చూస్తున్న‌ట్లు పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణ‌యం పూర్తిగా కాంగ్రెస్ వేసే త‌దుపరి అడుగుపై ఆధార‌ప‌డి ఉంటుందంటున్నారు. ఈ మేర‌కు రాబోయే వారంలో క్లారిటీ వ‌స్తుంద‌నేది రాజ‌కీయ వ‌ర్గాల మాట‌.