Begin typing your search above and press return to search.
కొమటిరెడ్డి బ్రదర్స్ ఝలక్..డుమ్మా కొట్టారు..!
By: Tupaki Desk | 18 Feb 2020 9:00 AM GMTస్వరాష్ట్రం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ పటిష్టం చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలతో పార్టీనే నాశనం చేస్తున్నారు. కలిసుంటే కలదు లాభం అనే సూత్రం మరచి ఎవరికి వారే మేం గొప్ప.. మేం సీనియర్ అంటూ కొట్లాడుకుంటూనే వారు తవ్వుకున్న గోతిలోనే వారు పడిపోతున్నారు. వారిని వారే ఓడించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుపెడితే తాజాగా సహకార సంఘాల ఎన్నికల వరకు కాంగ్రెస్ దారుణ ఫలితాలను చవిచూస్తోంది. దానికి పార్టీలోని విబేధాలే అని స్పష్టంగా తెలుస్తున్నా మేల్కోవడం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో పలువురు నాయకులు డుమ్మా కొట్టారు.
పని లేక ఖాళీగా ఉన్నామని భావించి ఒక అవసరం లేని డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో మహా ధర్నా చేపట్టారు. ఈ మహాధర్నాకు నామమాత్రపు స్పందన వచ్చింది. పెద్ద తలకాయల్లో కొందరు వచ్చారు.. మరికొందరు రాలేదు. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన విషయంపై కార్యక్రమం కదా రాలేదు.. అంటే సమావేశంలో మిగతా సామాజిక వర్గం నాయకులంతా హాజరయ్యారు.. అదే సామాజిక వర్గంలోని మరికొందరు హాజరు కాలేదు. దీన్ని చూస్తుంటే వర్గ పోరు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ధర్నాకు ఇవాలో రేపో.. అధ్యక్ష పదవి పోయే స్థితిలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి - పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ ఖుంటియా - మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి - శాసన సభ పక్ష నేత భట్టి విక్రమార్క - మాజీ ఎంపీలు వి. హనుమంతరావు - మధుయాష్కీ - పొన్నం ప్రభాకర్ - మాజీమంత్రులు జానారెడ్డి షబ్బీర్ అలీ - గీతారెడ్డి - ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఊకదంపుడు ప్రసంగాలు చేసి మమ అనిపించారు. ఈ కార్యక్రమం హఠాత్తుగా చేసి కనుమరుగయ్యారు. ఇంత చేసిన ఈ కార్యక్రమంలో పార్టీలోని మిగతా నాయకులు కనిపించలేదు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్ష రేసులో ఉన్నామని చెబుతున్న కొమటిరెడ్డి బ్రదర్స్ కనిపించలేదు. కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి - రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఎంపీ - ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వారిద్దరూ ఈ కార్యక్రమానికి రాలేదు. ఆహ్వానించలేదో.. లేదా డుమ్మా కొట్టారో తెలియదు కానీ వారైతే రాలేదు. ఇక ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క కూడా కనిపించలేదు. ఎందుకంటే వారి విషయమై ధర్నా చేశారు. హైదరాబాద్ లో ప్రధానంగా ఉన్న సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కనిపించలేదు.
ఈ విధంగా పార్టీలోని లుకలుకలతో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతున్నది. ఖుంటియా తెలంగాణలోనే అధికంగా ఉంటున్నా పార్టీని చక్కబెట్టడంలో విఫలమవుతున్నారు. పలుసార్లు ఖుంఠియాను వ్యక్తిగతంగా సొంత పార్టీ నాయకులే విమర్శలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ పార్టీ నిస్తేజంలో ఉండడానికి ప్రధాన కారణం వర్గ పోరే. అందరూ కలిస్తే కాంగ్రెస్ పార్టీ బతికే చాన్స్ ఉంది. వీరి వర్గపోరును ఆధారంగా చేసుకునే కేసీఆర్ లబ్ధి పొందుతున్నారు. ఆ విషయాన్ని గమనించనంత వరకు కాంగ్రెస్ ను ఎవరూ కాపాడలేరు. ఇప్పుడేం చూశారు.. కొన్నాళ్లు ఆగండి.. అధ్యక్ష స్థానం కోసం ఎట్లా కొట్లాడతారో వేచి చూడండి.