Begin typing your search above and press return to search.
బీజేపీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్...ట్విస్ట్ ఇది
By: Tupaki Desk | 14 April 2017 5:41 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేతలైన కోమటిరెడ్డి సోదరులు తరచూ ఏదో రూపంలో వార్తల్లోకి ఎక్కుతున్నారు. కొద్దికాలం క్రితం సోదరుల్లో ఎవరో ఒకరు పీసీసీ రథసారథి అవుతారని వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల వారు బీజేపీలోకి వెళ్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి సోదరుల్లో చిన్నవాడైన ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి తాజాగా మీడియాకు వివరణ ఇచ్చారు. తమపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు.
ఈ మేరకు ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన సారాంశం ఇది `కోమటిరెడ్డి సోదరులు బీజేపీ లోకి వెళ్తున్నారంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. గతంలో టీఆర్ ఎస్ లోకి వెళ్తున్నారని, ఇప్పుడేమో బీజేపీలోకి వెళ్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేయడం వెనుక కోమటిరెడ్డి సోదరులను రాజకీయంగా దెబ్బతీయాలని, కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చాలని కుట్రలు జరుగుతున్నట్టుగా అనుమానం వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే సోనియాగాంధీ - రాహుల్ గాంధీ నాయకత్వంలో విశ్వాసంగా పనిచేస్తాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత ఒత్తిడి చేసినా, ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి ఎలాంటి స్వార్థం లేకుండా కష్టపడతాం. పదవులు ఉన్నా, లేకున్నా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. కాంగ్రెస్ పార్టీపై, సోనియా గాంధీ నాయకత్వంపై విశ్వాసంతోనే ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచాను. తమను, కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చాలని టీఆరెస్ నాయకులు, పార్టీలో గిట్టని కొందరు నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను` అని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/