Begin typing your search above and press return to search.
విమోచన దినం వేళ.. కాంగ్రెస్ కు భారీ షాక్
By: Tupaki Desk | 12 Sep 2017 5:15 AM GMTఒక కీలక రాజకీయ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకోనున్నట్లుగా చెబుతున్నారు. అధినాయకత్వంపై పూర్తి అసంతృప్తితో పాటు.. తాము కోరుకున్నట్లుగా కీలక బాధ్యతలు తప్పగించని తీరుపై కోమటిరెడ్డి బ్రదర్స్ కోపంగా ఉండటం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసినా చప్పుడు చేయని పరిస్థితి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేలా కోమటిరెడ్డి బ్రదర్స్ కాషాయ కండువా కప్పుకోనున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. టీఆర్ ఎస్ లో ఉన్న డి. శ్రీనివాస్ కుమారుడు సైతం బీజేపీలోకి చేరుతూ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవంపై పట్టుదలగా ఉండి.. దాన్నో ఉద్యమ స్థాయిలో బీజేపీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పిన కేసీఆర్ తీరుకు భిన్నంగా.. ఇప్పుడా ఊసే ఎత్తని వైనంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తగ్గట్లే కొద్ది రోజులుగా విమోచన దినోత్సవంపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న నిజామాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రజల్లో మాంచి పట్టు ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ తనయుడు అరవింద్ కూడా కాషాయ కండువా కప్పుకోనున్నట్లుగా చెబుతున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెబుతున్నారు. తుది లాంఛనాల్ని పూర్తి చేసేందుకు వీలుగా పార్టీ చీఫ్ అమిత్ షాను కలవనున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రానున్నకొద్ది రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచనాలు నమోదు కానున్నాయని చెప్పక తప్పదు.