Begin typing your search above and press return to search.
కోమటి రెడ్డి బ్రదర్స్... 'పచ్చఛానెల్‌కు' బిగ్ ప్యాకేజీ!?
By: Tupaki Desk | 8 Aug 2022 3:48 AM GMTరాజకీయాలకు.. మీడియాకు మధ్య ఉండాల్సిన సున్నితమైన గీత చెరిగిపోతోందనే విమర్శలు కొన్నాళ్లు గా వినిపిస్తూనే ఉన్నాయి. నాయకుల అవసరం.. మీడియాకు కాసుల పంట పండిస్తోందనే పెదవి విరుపు లూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కీలక సందర్భాల్లో నాయకులు ఇరుక్కున్నప్పుడు.. మీడియా ఎంట్రీ ఇస్తోంది. వారికి ఎక్కడా లేని బూస్ట్ ఇవ్వడంతో పాటు.. అప్పటి వరకు వారికి లేని.. పటాటోపాలను తగిలించే ప్రయత్నం చేస్తున్న చానెళ్లు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
నిజానికి ఎన్నికల సమయంలోనే ఒకప్పుడు మీడియాలు పెయిడ్ ఆర్టికల్స్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని.. నాయకులకు అనుకూలంగా.. వార్తలు రాసిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. వీటిపై వివాదాలు కూడా అంతే రేంజ్‌లో కొనసాగాయి. తర్వాత.. తర్వాత.. డిజిటల్ మీడియా అభివృద్ధి చెందడంతో.. పరిస్థితి యూటర్న్ తీసుకుంది. నేరుగానే పెయిడ్ పబ్లిసిటీ కి ఛానెళ్లు ప్రయత్నిస్తున్నాయి. ఏదో ఒక కారణంతో..సదరు నాయకులను ఆకాశానికి ఎత్తేసే వ్యూహాలను కొన్ని ఛానెళ్లు అమలు చేస్తున్నాయి.
ఇప్పుడు ఇలాంటి వాటిలో.. ఒక ఛానెల్ ముందుందని రాజకీయ వర్గాల టాక్. ఈ క్రమంలో సదరు చానెల్.. బ్లాక్‌మెయిల్ ఎక్కువైందనే చర్చ పొలిటికల్ అనలిస్టు వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌నేత.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రిజైన్ చేసిన తర్వాత.. జరిగిన పరిణామాల్లో ఈ ఛానెల్ జోక్యం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
ఈ కాన్సెప్టును అడ్డు పెట్టుకుని.. బ్లాక్ మెయిల్ చేస్తూ.. కాసుల పంట పండించుకుంటున్నట్టు..రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజగోపాల్‌రెడ్డి మాత్రమే తన పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. ఈ చానెల్ మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని.. తొలిరోజు క్యాప్షన్లతో ఊదరగొట్టింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే.. తర్వాత..రోజు బీజేపీకి ఆయన డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ. .. బ్రేకింగ్ న్యూస్‌లు.
అంటే.. అప్పటి వరకు ఈ మీడియా చేసిందంతా.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఏదో ఒక విధంగా లైవ్‌లో ఉండేలా చేసింది. ఇది వివాదం కావాలని.. సంకల్పించింది. అంతా జరిగింది.ఇక, ఆ తర్వాత.. నుంచి.. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పాజిటివ్‌గా వార్తలు రాయడం.. ప్రసారం చేయడం ప్రారంభించింది. అదే సమయంలో రేవంత్ కు వ్యతిరేకంగా.. వార్తలు రాయడం.. ప్రసారం చేయడం చేసింది. అంతేకాదు.. పనిలో పనిగా..తెలంగాణ అధికార పార్టీ పైనా.. రాళ్లు వేసింది.
ఇంకేముంది.. కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నారంటూ.. రాసుకొచ్చింది.ముందస్తుకు వెళ్లిపోతు న్నారని కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా ఏం జరిగిందో తెలియదు కానీ.. సదరు ఛానెల్ పెద్దమనిషి.. రాజగోపాల్ తో ఇంటర్వ్యూ చేయడం.. మరింత ఆసక్తిగా మారింది. అంటే.. ముందుగా కోమటి రెడ్డి బ్రదర్స్‌కు వ్యతిరేకంగా..ఊదరగొట్టి.. తర్వాత..వారిని లైన్‌లో పెట్టుకుని.. ఇప్పుడు పాచికలకు పదును పెట్టిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి భారీ ప్యాకేజీ తీసుకుని.. రాబోయే రోజుల్లో 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు ఉండేలా..వార్తలను, కథనాలను అనుకూలంగా మలిచి ప్రచారం చేసేందుకు పెద్ద ఎత్తున డీల్ కుదిరిందని.. రాజకీయ వర్గాలు సహా.. మీడియా వర్గాల్లోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. మరి ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.