Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు: మేం అద్దె ఇంట్లో.. వాళ్లు ఫాంహౌసుల్లోనా?
By: Tupaki Desk | 28 March 2021 12:20 PM ISTనాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో రాజకీయం రాజుకుంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు పదునైన వ్యాఖ్యలతో ప్రచారపర్వంలో దూకుతున్నారు.
తాజాగా హాలియా సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు రాగానే డబ్బు మాటలతో రావడం టీఆర్ఎస్ నేతలకు బాగా అలవాటైందని కోమటిరెడ్డి మండిపడ్డారు.
ఏళ్ల తరబడి మంత్రులుగా ఉన్న తాము అద్దె ఇళ్లలో ఉంటుంటే.. టీఆర్ఎస్ మంత్రులు మాత్రం ఫాంహౌసులు కట్టుకొని అక్కడే ఉంటున్నారని విమర్శలు గుప్పించారు.
ఇక సాగర్ లో జానారెడ్డి మరోసారి బరిలోకి దిగడంపై కూడా కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవినీతిపాలన అంతమొందించడానికే జానారెడ్డి బరిలో నిలిచారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న కోమటిరెడ్డి.. బందిపోటు దొంగల్లా కాంగ్రెస్ నేతల ఇళ్లలో పడి బరాలాడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ మంత్రులకు తమకు తేడా ఉందని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.