Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌లో కోమ‌టి రెడ్డి క‌ల‌క‌లం.. రంగంలోకి అగ్ర‌నేత‌లు

By:  Tupaki Desk   |   29 July 2022 11:30 AM GMT
కాంగ్రెస్‌లో కోమ‌టి రెడ్డి క‌ల‌క‌లం.. రంగంలోకి అగ్ర‌నేత‌లు
X
కాంగ్రెస్ నాయ‌కుడు, న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విష‌యం.. కాంగ్రెస్‌లో క‌ల‌కలం రేపుతోంది. ఆయ‌న రాజీనామా చేస్తాన‌ని సంకేతాలు ఇవ్వ‌డం.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. బండి సంజ‌య్‌తో ట‌చ్‌లోకి వెళ్ల‌డం.. త‌ర్వాత‌.. త‌న అనుచ‌రుల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హించ‌డం వంటి ఘ‌ట‌న‌లు.. పార్టీలో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. మొద‌ట్లో ఈ విష‌యాల‌ను లైట్ తీసుకున్నా.. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ హ‌వాను దృష్టిలో పెట్టుకున్న పార్టీ అధిష్టానం.. ఇప్పుడు అలెర్ట్ అయింది.

వెంట‌నే కోమ‌టిరెడ్డితో చ‌ర్చించేలా అగ్ర నాయ‌కుల‌ను రంగంలోకి దింపింది. కేంద్ర మాజీ మంత్రి.. ఒక్క‌టి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ దిగ్విజ‌య్ సింగ్ స‌హా.. రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌, ఎంపీ మాణిక్కం ఠాకూర్ స‌హా.. ప‌లువురు అగ్ర‌నాయ‌కులు రంగంలోకి దిగారు.

కోమ‌టి రెడ్డిని బుజ్జ‌గించే ప‌నిచేప‌ట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కాంగ్రెస్ లోనే కంటిన్యూ చేసేలా చూడాలని పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు రిపోర్టు ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

దీనికి తోడు కోమటిరెడ్డిని పార్టీలో కొనసాగించాలని కాంగ్రెస్ లోని ఒక వర్గం గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఆయన్ని నిలువరించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాజగోపాల్ నివాసానికి వెళ్లి సంప్రదింపులు చేశారు. తాజాగా కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా రాజ‌గోపాల్‌తో చర్చించారు.

రాజగోపాల్ ను పార్టీలోనే ఉండేలా చూడాలని .. అందుకోసం చర్చలు జరిపేందుకు దూతగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించారు. ఈ క్ర‌మంలో రాజగోపాల్ తో ప్రత్యేకంగా భేటీ కావాలని ఉత్తమ్ నిర్ణయించారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా రంగంలోకి దిగారు. స్వయంగా రాజగోపాల్ కు ఫోన్ చేసి ఢిల్లీకి రావాల్సిందిగా రాజగోపాల్ రెడ్డి ని కోరారు.

అయితే.. ఆయ‌న వెళ్తారా.. లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. పార్టీ అధిష్టానం రాజ‌గోపాల్‌పై ఇంత ఇంట్ర‌స్ట్ పెట్ట‌డంతో దాదాపు ఆయ‌న త‌న డిమాండ్ల‌ను నెర‌వేర్చుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో పార్టీ కూడా కీల‌క నాయ‌కుడిని వ‌దులుకునేందుకు సిద్ధ‌ప‌డ‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.చివ‌ర‌కు ఈ రాజ‌కీయానికి ఎలాంటి ముగింపు ప‌డుతుందో చూడాలి.