Begin typing your search above and press return to search.
సోనియాతో కోమటిరెడ్డి భేటీ ... కారణం ఏంటంటే?
By: Tupaki Desk | 12 March 2020 10:55 AM GMTనేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. సోనియాగాంధీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి.. గురువారం ఉదయం ఆమెతో దాదాపు 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశం లో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ వస్తాడనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది... మొదట హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత అని.. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ముగియగానే అనే వార్తలు వచ్చాయి.
అతి త్వరలో దీనిపై అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోబోతుంది అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో .. సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త పీసీసీ చీఫ్ రేసులో కోమటిరెడ్డి ముందున్నారని, ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. పీసీసీ సారథ్యపగ్గాలను తనకు అప్పగించాలని గతంలో పలుసార్లు ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం పార్టీలో పలువురు ఆశావహులు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తదితరులు కూడా పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు.
భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వాలని సోనియాను కోరినట్లు, పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని సోనియాకు చెప్పినట్టు తెలిపారు. అలాగే మరో రెండు మూడు రోజుల్లోనే తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని, ఎన్నో ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా ఉంటూ... అంచెలంచెలుగా ఎదిగానని ఒక్క అవకాశం ఇస్తే , సామాన్య కార్యకర్తగా పనిచేసి కాంగ్రెస్ కి తెలంగాణ లో పూర్వవైభవం తీసుకొస్తానని మాట ఇచ్చినట్టు తెలిపారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ, నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు.