Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డిలో ఈ సడన్ ఛేంజ్ వెనుక కథేంటి?

By:  Tupaki Desk   |   12 Dec 2019 2:30 PM GMT
కోమటిరెడ్డిలో ఈ సడన్ ఛేంజ్ వెనుక కథేంటి?
X
2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని బీజేపీదే భవిష్యత్తు అని మొదట నినదించారు మన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్. బీజేపీతో సాన్నిహిత్యం నెరిపారు. ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేశారు. కానీ ఇప్పుడు అదే బీజేపీకి దూరం జరిగారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో కనిపిస్తూ కాంగ్రెస్ లో చురకుగా ఉంటున్నారు. ఇంతకీ రాజగోపాల్ రెడ్డిలో ఈ సడన్ ఛేంజ్ వెనుక అర్థమేంటనే అనుమానం ఇప్పుడు అందరికీ వచ్చేసిందట..

బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కమలనాథులు పలు కండీషన్లు పెట్టారట.. కాంగ్రెస్ కు రాజీనామా చేయాలని.. నీతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, అన్నయ్య వెంకటరెడ్డిని తీసుకోవాలని కోరారట.. దీంతో బేరం కుదరక రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ బాట పట్టారు. యాక్టివ్ గా తిరుగుతున్నారట..

ఇక పీసీసీ రేసులో అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండడంతో ఆయనకు సపోర్టుగా రాజకీయం చేస్తున్నారు. అన్న పీసీసీ చీఫ్ అయితే భవిష్యత్తులో మనకూ అధికారం దక్కుతుందని భావించి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీ వైపు చూడడం లేదట..

ఇలా బీజేపీ కాలదన్నడం.. కాంగ్రెస్ లో అవకాశాలు వస్తుండడంతో హస్తంతోనే ప్రయాణం సాగించడం మేలు అని రాజగోపాల్ తన ప్లాన్ ను మార్చుకున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. మరి ఇది ఎన్నాళ్లు అనేది వేచిచూడాలి.