Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డీ..ఇదేం బాగా లేదండీ!
By: Tupaki Desk | 14 Aug 2019 8:09 AM GMTకోమటిరెడ్డి ఫ్యామిలీకి తెలుగు నేలలో ప్రత్యేకించి తెలంగాణలో ఓ మోస్తరు మంచి పేరే ఉంది. కోటమిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా - మంత్రిగా - నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వెంకటరెడ్డి వ్యవహారంతో పార్టీ కొంత ఇబ్బంది పడ్డా... అటు పార్టీకి గానీ - ఇటు కోమటిరెడ్డి ఫ్యామిలీకి గాని ఎప్పుడూ పెద్దగా చెడ్డ పేరు వచ్చిన దాఖలా లేదనే చెప్పాలి. అయితే వెంకటరెడ్డి సోదరుడు - మాజీ ఎంపీ - ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుతో మాత్రం అటు పార్టీతో పాటు ఇటు ఫ్యామిలీకి కూడా చెడ్డ పేరు వచ్చేసిందన్న వాదన బలంగానే వినిపిస్తోంది.
కోమటిరెడ్డి ఫ్యామిలీ అంటేనే... కాంగ్రెస్ ఫ్యామిలీగా పేరుంది. అలాంటిది ఏదో పార్టీ కొన్నాళ్ల పాటు ఇబ్బంది తలెత్తిందన్న సాకు చూపి రాజగోపాల్ రెడ్డి ఏకంగా పార్టీ మార్పుపై సంచలన ప్రకటనలు చేశారు. సరే... చేసిన ప్రకటనల మేరకు పార్టీ అయినా మారారా? అంటే... అదీ లేదు. అదుగో - ఇదుగో అంటూ.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ - ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ బీజేపీ నేతలతో భేటీ అవుతున్నారు. అంతేకాకుండా ఏదో తాను పార్టీ మారుతున్నాను కాబట్టి బీజేపీ నేతలను కలుస్తున్నాను... అని రాజగోపాల్ రెడ్డి చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు ఏమీ లేని విధంగా పరిస్థితి తయారైంది. పార్టీ మారుతున్నానని - బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే... తానే సీఎంనని ప్రకటించుకున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పార్టీ మార్పుపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదంటూ ప్రకటించడం చూస్తుంటే... కోమటిరెడ్డి ఫ్యామిలీకి అంతో ఇంతో ఉన్న పరువును కూడా తీసేసినట్టుగానే భావించక తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
బుధవారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల అందరి మాదిరే మీడియాతో మాట్లాడిన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై సరైన సమసయంలో నిర్ణయం తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. మొత్తంగా తన సోదరుగు వెంకటరెడ్డి మాదిరిగా రాజకీయాల్లో తనకంటూ ఓ వ్యూహం లేని నేతగా రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు అప్రతిష్ఠ మూటగట్టుకున్నారని చెప్పక తప్పదు. రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో ఆయనకు మాత్రమే కాకుండా మొత్తంగా కోమటిరెడ్డి ఫ్యామిలీకి కూడా పరువు పోయిందన్న వాదన అయితే ఇప్పుడు బాగానే మొదలైపోయింది.