Begin typing your search above and press return to search.
మా తమ్ముడికే ఓటేయండి.. : వెంకట రెడ్డి ఆడియో వైరల్
By: Tupaki Desk | 21 Oct 2022 1:30 PM GMTఇప్పటి వరకు కాంగ్రెస్ తరఫున ఎన్నో పదవులు పొంది.. అనేక సార్లు టికెట్లు సొంతం చేసుకుని.. స్టార్ క్యాంపెయినర్‌గా కూడా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముసుగు దాదాపు తొలిగిపోయింది. కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేసినట్టుగానే.. ఆయన తన తమ్ముడి పక్షానే నిలబడ్డారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మునుగోడుకు జరుగుతున్న ఉప ఎన్నికలో.. కాంగ్రెస్ తన సిట్టింగు సీటును సొంతం చేసుకుని.. ఆధిపత్యం ప్రదర్శించాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇలాంటి సమయంలో సర్వశక్తులు ఒడ్డుతోంది. ముఖ్యంగా పార్టీని పుట్టిముంచిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని భావిస్తోంది.
అయితే.. రాజగోపాల్ రెడ్డి అన్న.. వెంకటరెడ్డి మాత్రం.. ముసుగు వీరుడుగా మారడం.. పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన ప్రచారానికి రాకపోగా.. లోపాయికారిగగా.. తన తమ్ముడి కోసం పనిచేస్తున్నారని.. కొన్నాళ్లుగా.. కాంగ్రెస్ భావిస్తోంది. అయితే.. దీనిని వెంకటరెడ్డి ఎప్పటికప్పడు ఖండించారు. కానీ, తాజాగా బయటకు వచ్చిన ఓ ఆడియో మాత్రం ఈ ముసుగు తీసేసింది.
టీపీసీసీ స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో వైరల్‌గా మారింది. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలంటూ ఎంపీ కోమటిరెడ్డి ఫోన్ కాల్ చర్చనీయాంశంగా మారింది.
ఓ కాంగ్రెస్ లీడర్‌తో కోమటిరెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ''ఈ దెబ్బతో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా'' అంటూ కాంగ్రెస్ ఎంపీ ఫోన్ కాల్‌లో సంభాషణ వినిపించింది. ''రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా.. అధికారంలోకి తీసుకొస్తా... పార్టీలను చూడొద్దు.. రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా.
చచ్చినా బతికినా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలి'' అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తూ వేచి చూడాలి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారిన ఈ ఆడియోపై స్పందించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందుబాటులో లేకుండాపోయారు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ ఎంపీ ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. పది రోజుల హాలిడే ట్రిప్ కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా వెళ్లారు. అదీ కీలకమైన ఎన్నిక సమయంలో కావడాన్ని బట్టి.. అందరికీ అనుమానాలు బలపడుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.