Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డి.. పొంగులేటికి కోపం వచ్చింది
By: Tupaki Desk | 28 April 2016 10:15 AM GMTఅధికారపక్షం బలంగా ఉన్నప్పుడు విపక్షాలు మరెంతో జాగరూకతో ఉండాలి. విపక్షాలకు అధినేతలుగా వ్యవహరించే వారు ఆచితూచి అడుగులు వేయాలి. ఎవరూ నొచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ.. అలాంటి పరిస్థితి ఏమీ కనిపించటం లేదు. తెలంగాణలోని విపక్షాల వ్యవహారం చూస్తే.. ఒక్కో పార్టీది ఒక్కో గొడవగా ఉంటుంది. టీడీపీలో నేతలే లేక.. ఉన్న ఇద్దరు ముగ్గురుతో ఉందంటే ఉందన్నట్లుగా ఉన్న పరిస్థితి.
ఇక.. బీజేపీ బలం నగరానికి మాత్రమే పరిమితం. అందులోనూ వారి మధ్య అంతర్గత గొడవలు.. అసంతృప్తులు చాలానే ఉన్నాయి. ఇక.. తోక పార్టీలుగా వ్యవహరించే సీపీఎం.. సీపీఐలు తమ ప్రాభవాన్ని పోగొట్టుకొని చాలాకాలమే అయ్యింది. ఇక.. మిగిలింది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్. ప్రజాదరణ లేని నాయకుడి కారణంగా చుక్కాని లేని నావలా నడుస్తున్న పరిస్థితి. ఉన్న నేతల్లోనూ సవాలచ్చ గొడవలు.. ఇగో సమస్యలు. వీటికి తోడు అధిపత్య పోరు. ఓపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రోజురోజుకీ బలోపేతం అవుతుంటే.. అందుకు భిన్నంగా కాంగ్రెస్ బలహీనమవుతోంది.
మరి ముఖ్యంగా పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల కారణం ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యవహరిస్తున్న తీరు. టీపీసీసీచీఫ్ గా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరిని కలుపుకుపోవటం లేదన్న విమర్శ ఉంది. ఇక.. సీఎల్పీ నేతగా వ్యవహరిస్తున్న జానారెడ్డి తీరు మీద కూడా టీపీసీసీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రారంభమైన టీసీఎల్పీ సమావేశంలో జరిగిన లొల్లి ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేల్ని మాత్రమే ఆహ్వానించినట్లుగా చెప్పటంతో మీటింగ్ కు వచ్చిన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇన్విటేషన్ రావటంతోనే తాను సమావేశానికి వచ్చానే తప్పించి.. ఆహ్వానం అందకుండా రాలేదని స్పష్టం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే వారు ఊహించని సీఎల్పీ పెద్దలకు మరో షాక్ తగిలింది.
నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సమావేశాన్ని బహిష్కరించారు. ఆర్నెల్లుగా నల్లొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉందని.. ఇప్పటివరకూ దానికి ఎవరిని ఎంపిక చేయలేదంటూ ఆయన మండిపడ్డారు. ఇలా ఇరువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని వాకౌట్ చేయటంతో మిగిలిన టీ కాంగ్రెస్ నేతల నోట మాట రాని పరిస్థితి. నేతల మధ్య ఇలాంటి స్పర్థలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవససరం ఉత్తమ్.. జానాల మీద ఉందన్న విషయాన్ని గుర్తించాలి. అలాంటి జాగ్రత్తే ఉంటే.. ఇంత లొల్లి అయ్యేది కాదుగా?