Begin typing your search above and press return to search.

గ‌న్ మెన్ల కోసం కోర్టుకెక్కిన ఆ ఇద్ద‌రు

By:  Tupaki Desk   |   26 Jun 2018 4:52 AM GMT
గ‌న్ మెన్ల కోసం కోర్టుకెక్కిన ఆ ఇద్ద‌రు
X
దెబ్బ మీద దెబ్బ తిన్న‌ప్ప‌టికీ ప‌ట్టించుకోకుండా మ‌రిన్ని త‌ప్పులు చేయ‌టం.. కోర్టు చేత అదే ప‌నిగా మొట్టికాయ‌లు తిన‌టంలో కేసీఆర్ స‌ర్కారు వేరుగా ఉంటుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. పాల‌నా ప‌ర‌మైన అంశాలు మొద‌లుకొని.. రాజ‌కీయంగా మ‌రికొన్ని అంశాల వ‌ర‌కూ కేసీఆర్ స‌ర్కారు తీరుపై విమ‌ర్శ‌లు వెల్తువెత్త‌టంతో పాటు.. వేలెత్తి చూపించేలా ఉంటాయి.

తాజాగా అలాంటిదే మ‌రొక‌టి చోటు చేసుకోనుందా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది. అసెంబ్లీలో అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారంటూ వేటు వేసిన తెలంగాణ‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. సంప‌త్ లు తాజాగా కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్ప‌టికే త‌మ శాస‌న‌స‌భ స‌భ్య‌త్యాల్ని ర‌ద్దు చేసిన వైనంపై వీరిద్ద‌రు హైకోర్టును ఆశ్ర‌యించ‌టం.. వారి వాద‌న‌పై న్యాయ‌స్థానం సానుకూలంగా స్పందించ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. త‌మ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త నిమిత్తం అన్ని వేళ‌ల్లో ఇద్ద‌రు గ‌న్ మెన్లు ( టూ ప్ల‌స్ టూ) ఉండేలా నియ‌మించాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. హోం శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి.. డీజీపీ.. జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఎస్పీ..న‌ల్గొండ జిల్లా ఎస్పీల‌కు నోటీసులు జారీ చేశారు.

త‌మ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణ‌యాన్ని హైకోర్టు త‌ప్పు ప‌ట్టిన నేప‌థ్యంలో.. త‌మ‌కు తొల‌గించిన గ‌న్ మెన్ల‌ను పున‌రుద్ద‌రించాల్సిందిగా ఆయ‌న కోరారు. దీనిపై ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌టానికి హైకోర్టు స‌మ‌యం ఇచ్చింది. తాజా వ్యాజ్యంలోనూ కేసీఆర్ స‌ర్కారుకు ఎదురుదెబ్బ త‌ప్ప‌ద‌ని.. కోర్టు ఆదేశాల‌కు ముందే.. ఇరువురు ఎమ్మెల్యేల‌కు గ‌న్ మెన్ల‌ను కేటాయించ‌టం మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. కేసీఆర్ అందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.