Begin typing your search above and press return to search.
తెలంగాణ భవన్లో వారికి అవమానం!
By: Tupaki Desk | 17 March 2018 4:05 AM GMTతెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. దేశ రాజధాని ఢిల్లీలోనూ చేదు అనుభవాలు తప్పటం లేదు. తెలంగాణ ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి.. సంపత్ లకు రూములు ఇచ్చేందుకు అక్కడి వారు నిరాకరించారు.
రూంలు ఖాళీగా లేవంటూ.. ఈ ఇద్దరు నేతల్ని మాజీలుగా పేర్కొన్నారు. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు అసెంబ్లీలో గాయం కావటానికి కారణంగా భావిస్తూ.. కోమటిరెడ్డి.. సంపత్ లపై బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం హైకోర్టులో న్యాయపోరాటం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన వారికి.. మాజీ ఎమ్మెల్యేలకు గదులు ఇవ్వలేమని చెప్పటం గమనార్హం.
తమకు గదులు ఇవ్వొద్దని ప్రభుత్వం నుంచి ఫోన్లు వచ్చాయా? అంటూ ఇరువురునేతలు మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. నాలుగుసార్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న తనను ఇంతలా అవమానిస్తారా? అంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేను ఇలా అవమానిస్తారా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. గదులు ఖాళీ లేకనే ఇవ్వలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా.. మాజీల ముద్రేసి రూములు లేవని చెప్పటంపై కోమటిరెడ్డి.. సంపత్ లు తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు.
మరోవైపు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఈ నెల 18వరకు ఢిల్లీలో జరిగే పార్టీ ప్లీనరీకు హాజరయ్యేందుకు ఢిల్లీ బాట పడ్డారు. పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మరికొంతమంది నేతలు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు.