Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డి మాటను సందేహించాలా?
By: Tupaki Desk | 3 April 2016 9:15 AM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ ఉన్న నాయకులు కొంతమంది ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో దూసుకుపోతూ.. విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అంతా తానై పోతున్న వేళ కూడా.. జిల్లాల్లో తమ పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్న కాంగ్రెస్ నేతల్లో కోమటిరెడ్డి ఒకరు. ఈ మధ్యన జరిగిన స్థానిక ఎన్నికల్లో తన సత్తాను ప్రదర్శించి.. టీఆర్ ఎస్ కు కొరకరాని కొయ్యలా మారారని చెప్పాలి.
అలాంటి కోమటి రెడ్డి నోటి వెంట వచ్చిన తాజా వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుకూలంగా తాను ప్రచారం చేస్తానని ఆయన చెబుతున్నారు. అయితే.. ఇందుకు ఒక షరతు ఉందంటున్నారు. కేసీఆర్ కట్టి ఇస్తానని చెబుతున్న డబుల్ బెడ్రూం ఇళ్లను గ్రామానికి యాభై చొప్పున.. హైదరాబాద్ లో లక్ష ఇళ్లను కానీ కట్టి ఇస్తే.. తాను ఎన్నికల్లో కేసీఆర్ తరఫున ప్రచారం చేస్తానని చెబుతున్నారు.
కోమటిరెడ్డి మాటలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కసారి ఉలిక్కిపడే పరిస్థితి. కోమటిరెడ్డి వ్యాఖ్యలోని శ్లేషను అర్థం చేసుకునేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల హామీని ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ పూర్తి చేయలేరన్న భావంలోనే కోమటిరెడ్డి వ్యాఖ్యానించి ఉంటారంటున్నారు. అయితే.. కోమటిరెడ్డి లాంటి మాటల్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకుంటే మాత్రం వ్యవహారం మరోలా ఉంటుందన్న మాటను తెలంగాణ కాంగ్రెస్ నేతలు తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నా.. హైదరాబాద్ లో లక్ష ఇళ్లు కట్టించి ఇవ్వటం సామాన్యమైన విషయం కాదని.. పెద్ద ఎత్తున నిధులు అవసరమంటున్నారు.
ఒకపక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు.. మరోపక్క మిషన్ భగీరథ.. ఇంకోపక్క డబుల్ బెడ్రూం ఇళ్ల హామీని పూర్తి చేయటం అసాధ్యమంటున్నారు. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే అలవాటున్న కేసీఆర్.. కోమటిరెడ్డి చేత వచ్చే ఎన్నికల్లో తన తరఫున ప్రచారం చేయించుకుంటారా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.