Begin typing your search above and press return to search.
కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం సవాల్
By: Tupaki Desk | 14 Jun 2016 10:28 AM GMTకాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటల వేడి సవాల్లు విసురుకునే స్థాయికి చేరింది. గులాబీ గూటికి ఎగిరిపోడానికి నిర్ణయించుకొని కాస్తంతలో వెనక్కు తగ్గిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు-మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ఆసక్తికర సవాల్ విసిరారు. ఆయన టార్గెట్ చేసింది సొంత జిల్లా నల్గొండకే చెందిన పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని కావడం విశేషం.
టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించే సమయంలో గుత్తా మాట్లాడుతూ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు మనోవేదన కల్గిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి "దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగుదేశంలో ఉన్నపుడు గుత్తా - మోత్కుపల్లి నర్సింహులు రోజూ రోడ్కెక్కి తెగ కొట్టుకొనేవారు - తిట్టుకొనేవారు. ఆనాడు ఎలాంటి మనోవేదనలూ ఆయనకు కలగలేదెందుకని ?” అని కోమటిరెడ్డి హేళనగా అన్నారు. రాజీనామా చేయడానికి సిద్ధమని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ “రాజీనామా చేయాలన్న అభిప్రాయం చెప్పడం కాదు. నిర్ణయం తీసుకోండి. వెంటనే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి. ఈ సారి గనక మీరు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నేను మాట మీద నిలబడే వ్యక్తిని. ఈ సవాల్ కు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఆయన రెడీయా?” అని కోమటిరెడ్డి ఛాలెంజ్ చేశారు.
తమ జిల్లాకు చెందిన నాయకులే అయినప్పటి ఎంపీ గుత్తా - ఎమ్మెల్యే భాస్కర్రావు లాంటి నేతలు వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బందేం లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని వారే పార్టీని నిలబెడ్తారని చెప్పారు. అధికార టీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కునేందుకు తమ పార్టీ సన్నద్దం అవుతోందని, ఇందుకోసం తామంతా కృషిచేస్తామని చెప్పారు. పార్టీ నేతలంతా చర్చించుకోని ఈ కార్యాచరణ సిద్దం చేస్తామని ప్రకటించారు.