Begin typing your search above and press return to search.
దమ్ము సవాలు చేసిన కోమటిరెడ్డి
By: Tupaki Desk | 14 Oct 2016 11:14 AM GMTఆత్మవిశ్వాసంతో విపక్షాలపై విరుచుకుపడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతల విమర్శల డోసు మరింతగా దట్టిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విపక్షాల బలం ఏమీ లేదని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏడెనిది సీట్లకు మించి రావంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై గురువారం కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విమర్శల పరంపర ఈ రోజూ కొనసాగుతోంది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని.. ఆయన అనుకుంటున్నట్లుగా తమ బలం ఏమాత్రం తగ్గలేదన్న వాదనను చెప్పేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి.. సీఎం కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. సర్వేలతో కాలం గడుపుతున్నారన్న ఆయన.. నల్గొండ జిల్లాలలో పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లగలరా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ కానీ గెలిస్తే తాను 2019 ఎన్నికల్లో పోటీ చేయనని వ్యాఖ్యానించారు.
తాను చేసిన సవాలుకు కేసీఆర్ స్పందిస్తారా? అంటూ సవాలు విసిరిన ఆయన.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేసీఆర్ గజ్వేల్ లో ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. 31 జిల్లాలు కాదు.. 131 జిల్లాల్ని ఏర్పాటు చేసినా టీఆర్ ఎస్ ఓటమి ఖాయమన్నారు. రుణమాఫీ.. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించని కేసీఆర్ కు ఓటు వేయాల్సిన అవసరం ఏమిటంటూ మండిపడ్డారు. కోమటిరెడ్డికి షాకిచ్చేలా కేసీఆర్ తన జంపింగ్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికల గోదాలోకి దింపుతారా? ఉద్యమ నేతగా ఉండి ఉంటే.. ఇలాంటి సవాళ్లకు కేసీఆర్ స్పందించే వారేమో? పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారిన టీఆర్ ఎస్ ఇలాంటి సవాళ్లను స్వీకరించదేమో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/