Begin typing your search above and press return to search.
ఢిల్లీలోనే ఉండి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టిస్తా
By: Tupaki Desk | 17 March 2018 10:04 AM GMTఅసెంబ్లీ నుంచి అనూహ్య రీతిలో అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ ఉపనాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి ఈ సందర్భంగా తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలోనే ఇలా ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలోకి పోలీసులు రాకూడదని, అనుమతి లేకుండా ఎలా వచ్చారని నిలదీశారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టాలనేదే తన లక్ష్యమని - ఢిల్లీలోనే ఉండి సీబీఐ - ఈడీ - సీవీసీకి కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఫిర్యాదు చేస్తానని కోమటిరెడ్డి తెలిపారు.
నాలుగు ఏళ్ల నుంచి కేసీఆర్ ప్రజలందరిని కులాల వారిగా విడదీస్తూ మోసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని దోచుకొని తెలంగాణ మొత్తం ఖాళీ చేశారని కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు తీసుకొనివచ్చి తెలంగాణ రాష్టాన్ని దివాలా తిసేలా చేశారని, ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణ ఆస్తులను దోచి పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ మోసాలను ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. బడ్జెట్ పెరిగే కొద్ది పుస్తక సైజ్ కూడా పెరగాలని, ఇచ్చిన బడ్జెట్లో ఏ ఒక్క రంగానికి క్లారిటీ ఇవ్వలేదని ఆయన తెలిపారు. 12వ తేదీ గవర్నర్ ప్రసంగం చూసి ఎమ్మెల్యేలం అందరం ఆశ్చర్యానికి గురి అయ్యామని, వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రస్తావన ఎక్కడ రాలేదని తెలిపారు.
నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ లేకపోవడం వల్ల పెదవాళ్లు చనిపోతున్నారని, ప్రగతిభవన్ నుంచి కేసీఆర్ బయటకే రాడని ఎద్దేవా చేశారు. కూర్చున్న కుర్చీలోంచి లేవలేడు కానీ నీకు థర్డ్ ఫ్రెంట్ అవసరమా? అని, ప్రధానమంత్రిని - రాహుల్ గాంధీని గాడు అని ఎలా సంబోధిస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో తన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ను చంపించారని కోమటిరెడ్డి ఆరోపించారు.