Begin typing your search above and press return to search.
బంగారు తెలంగాణ...అదో మిలియన్ డాలర్ల ప్రశ్న
By: Tupaki Desk | 16 Nov 2017 3:31 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే జపించే, టీఆర్ఎస్ పార్టీ తరచూ ప్రస్తావించే...బంగారు తెలంగాణ పదంపై భారీ జోక్ పేల్చారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఈ పదానికి స్పష్టంగా వివరణ లేనప్పటికీ ఇటు గులాబీ దళపతి కానీ అటు పార్టీ నేతలు కానీ తరచుగా ప్రస్తావిస్తుంటారు. ఈ విషయంలో కొందరిలో ఉన్న సందేహాన్ని పూర్తి వ్యంగంతో చెప్పారు కోమటిరెడ్డి.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన సభలో ప్రసంగిస్తూ..అధికార పార్టీ ప్రతీసారి బంగారు తెలంగాణ అంటూ చెబుతుండడం ఏంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసలు బంగారు తెలంగాణ ఏంటో చెప్పాలని, బంగారు తెలంగాణ అంటే ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావడం లేదని సభా వేదికగా అన్నారు. అదొక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిందని కోమటిరెడ్డి అన్నారు. ఈ విషయంలో స్పష్టత ఇస్తే తమకు కూడా సంతోషంగా ఉంటుందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, ఎప్పుడూ అధికార పార్టీ వారు కాంగ్రెస్ హయాంలో వాటిని విమర్శించడం సరైంది కాదని కోమటిరెడ్డి వివరించారు. ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఇచ్చి మూడేళ్లు దాటినా దాని ఊసే లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి అన్నారు. పాఠశాలల్లో విరాళాలతో సౌకర్యాలు సమకూర్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. బంగారు తెలంగాణ సాధన దిశగానే ప్రస్థానాన్ని ప్రారంభించాం, అది మీకు కనపడకుంటే తామేం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సొంత రాష్ట్రాన్ని మనకు మనమే శపించుకోవడం మంచిదికాదు, అలాగే రాత్రికి రాత్రే బంగారు తెలంగాణ సాధ్యమైతదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించటమే ఏకైక ధ్యేయంగా ప్రతిపక్షం పోతున్నట్లు కనిపిస్తుందని ఆయన తెలిపారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి స్వీకరిస్తామని తెలిపారు.