Begin typing your search above and press return to search.
అదేంది భయ్..కోమటి రెడ్డి గట్లగ మాట్లాడిండేంది?
By: Tupaki Desk | 8 Jun 2016 2:27 PM GMTరేపో మాపో జంప్ అయిపోయి గులాబీ కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారేందుకు డిసైడ్ అయినందుకే కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నట్లుగా ఊహాగానాలు ఓపక్క భారీగా వినిపిస్తుంటే.. అందుకు భిన్నంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తున్న కాంగ్రెస్ నేత.. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన కోమటిరెడ్డి.. గుత్తా పార్టీ మారతారని తాను భావించటం లేదన్నారు. ఇప్పటికే రెండుసార్లు పార్టీ మారిన గుత్తా.. మరోసారి పార్టీ మారితే పరువు పోగొట్టుకోవటం ఖాయమని.. ఒకవేళ పార్టీ మారితే మాత్రం పదవికి రాజీనామా చేసి మారాలంటూ వ్యాఖ్యానించటం విశేషం.
కోమటిరెడ్డి పార్టీ మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తున్నవేళ.. ఆయన మాదిరే పార్టీ మారతారన్న అంచనాలు వ్యక్తమవుతున్న గుత్తాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయనే చెప్పాలి. ఉన్నట్లుండి కోమటిరెడ్డి మాటల్లో తేడా చూస్తుంటే.. కారు ఎక్కే ప్రోగ్రాం వాయిదా వేసుకోవటంతో పాటు.. గుత్తాకు కూడా బ్రేకులు వేస్తున్నట్లు అనిపించట్లేదు..? గుత్తా ఇష్యూ మాత్రమే కాదు.. నిన్నటి వరకూ తెలంగాణ పార్టీ నాయకత్వంపై దునుమాడిన కోమటిరెడ్డి..తాజాగా తెలంగాణ అధికారపక్షంపై విమర్శలు చేశారు. రైతులమాఫీ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయాలన్న డిమాండ్ వినిపించిన ఆయన.. తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? అంటే కేసీఆర్ సర్కారును నిలదీయటం గమనార్హం.