Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు ఇంటర్ పరీక్ష!
By: Tupaki Desk | 4 May 2019 1:50 PM GMTఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతా అందట. అలా ఉంది కేసీఆర్ కథ అంటున్నారు.... నల్గొండ కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డి. ఇంటర్ అవకతవకలపై తాజాగా కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో కోమటిరెడ్డి కేటీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ ఫలితాల అవకతవకల వల్ల పాతిక మంది ప్రాణాలు పోయాయి. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి అని డిమాండ్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే చేతగాలే గానీ... ప్రధాని అయ్యి దేశాన్ని పాలిస్తాడా అని వ్యంగమాడారు.
ఇక ఈ ఇంటర్ ఎపిసోడ్ సృష్టించిన కలకలం చల్లబడకపోగా రోజురోజుకు పెద్దదై ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అన్ని పార్టీలు ఈ అవకాశాన్ని వాడుకుంటున్నాయి.
సినిమా వాళ్లు భయపడి ఇంటర్ బోర్డును మాత్రమే నిందించి విద్యార్థులకు సుద్దులు చెప్పారు. కానీ రాజకీయ పార్టీలు ఛాన్స్ దొరికింది అన్నట్టు వ్యవహరించాయి.
లక్షలాది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన పేపర్లు దిద్దడంలో జరిగిన పొరపాట్లు కేసీఆర్ ను బాగానే డీఫేమ్ చేశాయి. ముఖ్యంగా పరీక్షల ఫలితాల్లో గందరగోళం నేపథ్యంలో విద్యార్థులు అనేక మంది ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వానికి ఎక్కువ డామేజ్ చేసింది. ప్రతిపక్షాలు ఇదే ఛాన్సులే అంటూ రోడ్డు ఎక్కాయి. విద్యార్థి సంఘాలు ఊపిరి పోసుకున్నాయి. బహుశా కేసీఆర్ వచ్చాక చప్పబడిన అన్ని సంఘాలకు ఇంటర్ గొడవ ఊపిరిలూదింది. కాంగ్రెస్, బీజేపీ చివరకు జనసేన కూడా ఈ ఛాన్సును గట్టిగా వాడుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో జనసేన తెలంగాణలో లేనేలేదు అనే ఫీలింగును పోగొట్టుకోవడానికి ఈ అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంది. జనసేన మాత్రమే గట్టిగా పోరాడుతుందని నాగబాబు తనకు తాను కితాబు ఇచ్చుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆరు రోజుల వరుసగా దీక్ష చేసిన అనంతరం అమిత్ షా చెప్పారని దీక్ష విరమించారు. బీజేపీ అనుబంధ సంఘాలు ఏబీవీపీ వంటివి హడావుడి చేశాయి. కాంగ్రెస్ గతంలోనూ ఆందోళనలు చేసిన తాజాగా కూడా మళ్లీ ధర్నా చేపట్టింది. దీనికంతటికీ కారణం కేసీఆర్ అని ఆరోపించింది. గాంధీభవన్ ఆవరణలో యూత్ కాంగ్రెస్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష చేపట్టింది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ - మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఇంటర్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నా రని మధుయాష్కీగౌడ్ ప్రశ్నిం చారు.
మరోవైపు ఇంటర్ బోర్డ్ అక్రమాలపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని వామపక్షాలు నిలదీశాయి. రాజ్ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు - వామపక్షాల నేతలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిలలో ఆందోళనలు ఉదృతం అయ్యాయి. ప్రభుత్వం ఆందోళనలను చల్లార్చడానికి సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించినా చల్లారలేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా ఇప్పటికీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా తప్పు తమ వైపు ఉండటంతో ఇంతకంటే గట్టిగా ప్రభుత్వం వారిని నిలువరించలేకపోతోంది. ఏదేమైనా ఇంటర్ ఇష్యూతో కేసీఆర్ ను ప్రశ్నించడం తెలంగాణలో మొదలైందని చెప్పాలి.