Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి రైలు మార్గ‌మేస్తాడ‌ట‌!..గెలిపించాల‌ట‌!

By:  Tupaki Desk   |   26 April 2019 4:44 PM GMT
అమ‌రావ‌తికి రైలు మార్గ‌మేస్తాడ‌ట‌!..గెలిపించాల‌ట‌!
X
కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి... పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరే. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన ఈ కాంగ్రెస్ నేత‌... మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కారు జోరుకు బేజారై ఓటమిపాల‌య్యారు. టీఆర్ ఎస్ ను గ‌ద్దె దించుతామని - తాను కూడా సీఎం రేసులో ఉన్నానంటూ ఎన్నిక‌ల‌కు ముందు త‌న‌దైన శైలి ప్ర‌సంగాలు చేసిన కోమటిరెడ్డి... ఏకంగా ఎన్నిక‌ల్లో తాను ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాస‌మేన‌ని స‌వాల్ కూడా చేశారు. అయితే అవ‌త‌లి వ‌ర్గం నుంచి ఈ స‌వాల్ ను స్వీక‌రించి ఏ ఒక్క‌రూ ముందుకు రాని నేప‌థ్యంలో ఈ స‌వాల్ ను స‌వాల్ గా ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం లేద‌నుకోండి.

అయినా ఇప్పుడు అస‌లు విష‌యం చెప్ప‌కుండా... కోమ‌టిరెడ్డి బ‌యోగ్రాఫీ చెబుతారా? ఏంటీ? అని డౌట్ ప‌డుతున్నారా? అలాంటిదేమీ లేదు గానీ... ఎమ్మెల్యేగా ఓడిపోయిన కోమ‌టిరెడ్డి... ఇప్పుడు ఎంపీగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఇటీవ‌ల ముగిసిన ఎంపీ ఎన్నిక‌ల్లో ఆయ‌న భువ‌న‌గిరి నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. పోలింగ్ ఏలాగూ ముగిసింది క‌దా... ఇప్పుడెన్ని మాట‌లు చెప్పినా ప్ర‌యోజ‌నం లేదు క‌దా. అయితే అస‌లు హామీలు ఇవ్వ‌కుండా రాజ‌కీయ నేత‌లు కొన‌సాగేదెలా? అంటున్నారు కోమ‌టిరెడ్డి. నిజ‌మే... హామీలు ఇవ్వ‌కుండా రాజ‌కీయాలు చేయ‌లేరు. చేయ‌రు కూడా. స‌రే... ఇంట‌ర్ వివాదంపై త‌న‌దైన శైలిలో స్పందించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన కోమ‌టిరెడ్డి... ఓ కొత్త హామీని గుప్పించారు.

అదేంటంటే... రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌ధానులు హైద‌రాబాద్‌ - అమ‌రావ‌తిల మ‌ధ్య ప్ర‌త్యేక రైలు మార్గాన్ని తీసుకొస్తాన‌ని కోమ‌టిరెడ్డి హామీ ఇచ్చేశారు. అయితే త‌న‌ను గెలిపిస్తేనే... ఈ హామీని నెర‌వేర్చ‌గ‌ల‌నని కూడా ఆయ‌న స‌విన‌యంగా మ‌న‌వి చేసుకున్నారు. అది కూడా ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య సూర్యాపేట మీదుగానే స‌ద‌రు రైల్వే లైనును తీసుకొని వ‌స్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌రే... ఎలాగూ ఎంపీ ఎన్నిక‌ల పోలింగ్ అయిపోయింది క‌దా... ఇప్పుడు రానున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అయినా టీఆర్ ఎస్ కు గ‌ట్టిగానే బుద్ధి చెప్ప‌డంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ‌చాలంటూ ఆయ‌న త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.