Begin typing your search above and press return to search.
సీఎం జగన్ కి జై కొడుతున్న తెలంగాణ నేతలు!
By: Tupaki Desk | 3 Jan 2020 8:51 AM GMTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నలుగురు మెచ్చే ప్రజా పాలనని అందిస్తూ ..పలువురికి ఆదర్శముగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ మధ్య దిశ ఉందంతం జరిగిన తరువాత దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోనటువంటి సంచలనమైన నిర్ణయాన్ని తీసుకోని దమ్మున్న సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దిశ చట్టం అమల్లోకి తెచ్చిన తరువాత ..ఢిల్లీ - బీహార్ రాష్ట్రాలు కూడా దిశ చట్టం వైపు చూస్తున్నాయి అంటే అది సీఎం జగన్ అంటే. ఇలా నలుగురు మెచ్చే పరిపాలన అందిస్తున్నారు కాబట్టే ...ఇతర రాష్ట్రాల నేతలు కూడా సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ మధ్య తెలంగాణ సీఎం తనయుడు - మంత్రి కేటీఆర్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో భాగంగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. వైఎస్ జగన్ ఆరు నెలల పాలన బాగుందని కితాబిచ్చారు. జగన్ పరిపాలన బాగుందని తాను ఫీల్ అవుతున్నానని ఆయన చెప్పారు. తాజాగా తెలంగాణకు చెందిన మరో సీనియర్ నేత సీఎం జగన్ పై పొగడ్తలు కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తున్నారని, జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండీ హామీల అమలుకు విశేషంగా కృషి చేస్తున్నారని - అధికారంలోకి వచ్చిన తరువాత ఆరునెలల కాలంలో ఎన్నో హామీలను నెరవేర్చారని కితాబిచ్చారు. మొదటి సారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
ఏపీ సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన కోమటిరెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాత్రం విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చినా ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చడం లేదని , ప్రజల బాగోగులు గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని , కానీ , ఏపీ సీఎం జగన్ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు అని ప్రశంసించారు. అలాగే కేసీఆర్ ఏ హామీని కూడా అమలు చేయలేదు అంటూ ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతుక ఉన్నప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. అందుకోసం వచ్చే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఇచ్చి సీఎం కేసీఆర్ అహంకారానికి తగిన బుద్ధి చెప్పాలని కోమటిరెడ్డి ప్రజలకి పిలుపునిచ్చారు.