Begin typing your search above and press return to search.
కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటు ఇదే
By: Tupaki Desk | 17 July 2016 7:08 AM GMTసీఎల్పీ ఉపనేత - నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోమారు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరడంపై మండిపడిన కోమటిరెడ్డి ఈ క్రమంలో కేసీఆర్ ను సైతం ఇరుకునపడ్డారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ ఐరన్ లెగ్ అని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. పదవుల కోసం మూడు పార్టీలు మారిన చరిత్ర ఆయనదని విమర్శించారు. సీఎం కేసీఆర్ టీఆర్ ఎస్ లోకి చేర్చుకుని పెద్ద రాజకీయ పొరపాటు చేశారని విమర్శించారు.
తన అనుచరుడు అయిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీగా గుత్తా పోటీ చేసినందునే 2009 - 2014 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు పరిధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారంటూ గుత్తా చెప్పుకోవడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ గా వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 2004 ఎన్నికల్లో తన చేతిలో ఓడిన గుత్తా తదుపరి ఎన్నికల్లో తననే గెలిపించానంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గుత్తా రాజీనామా చేయాలనే ప్రతిపాదనను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయన రాజీనామా ద్వారా వచ్చే నల్లగొండ ఉప ఎన్నికతోనే టీఆర్ ఎస్ కు చెడ్డ రోజులు - కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయని ఈ ఎన్నికల్లో తెలంగాణలోనే అత్యధికంగా 6 లక్షల మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించడమే తన లక్ష్యమన్నారు.