Begin typing your search above and press return to search.

ముషార‌ఫ్‌ ను మించిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   26 Aug 2015 6:51 AM GMT
ముషార‌ఫ్‌ ను మించిన కేసీఆర్‌
X
కొద్దికాలం కింద‌టివ‌ర‌కు తెలంగాణ ముఖ్యమంత్రిని కేసీఆర్‌ ను పల్లెత్తు మాట అనని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక్కసారిగా తన స్టాండ్ మార్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన నియోజకవర్గంలో గత కొద్ది కాలంగా హల్ చల్ చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంబించిన స‌మ‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డ ఆయ‌న తాజాగా అదే నియోజ‌క‌వ‌ర్గంలోని తిప్పర్తిలో హంగామా చేశారు.

మరో రెండు రోజుల్లో మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉన్న తిప్పర్తి లోని మోడల్ స్కూలు, కస్తూర్బా పాఠశాల భవనాలను మంత్రితో సంబంధం లేకుండా.... నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే హోదాలో కోమ‌టిరెడ్డి ముందే ప్రారంభించారు. అయితే ఈ కార్య‌క్ర‌మాన్ని అడ్డుకునేందుకు టీఆర్ ఎస్ నాయ‌కులు అడ్డుప‌డ్డారు. విజ‌య‌వంతం చేసేదిశ‌గా కాంగ్రెస్ నాయ‌కులు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తిప్పర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆరెస్ - కాంగ్రెస్ కార్యకర్తల మద్య యుద్ధ‌వాతావ‌రణం నెలకొంది. చివరికి స్వల్ప లాఠీచార్జీ కూడ జరిగింది.

అధికారులు ఎవరూ హజరుకాకున్నా కోమటిరెడ్డి తాను ప్రారంబించాల్సిన పనులను ప్రారంభించారు. ఇంతటితో ఆగకుండా ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ప్రభుత్వ పాలన నిజాం, ముషారఫ్ పాలనను గుర్తుకు తెస్తుందని ఆరోపించారు. విద్యార్దులు, నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిదులు ఖరీదైన కార్లలో తిరుగుతున్నారని ఆయన మండిప‌డ్డారు. సరైన సమయంలో ముఖ్యమంత్రికి దేవుడు శిక్ష వేస్తాడని కోమటిరెడ్డి శాప‌నార్థాలు పెట్టారు. జిల్లాలో గెలిచిన టీఆర్ ఎస్ ప్రజాప్రతినిదులు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే ఒక్కరు కూడ గెలిచే పరిస్తితి లేదన్నారు. దీనిని దృష్టిలొ ఉంచుకుని వారంతా మసులుకోవాలని కోమటిరెడ్డి హెచ్చ‌రిక‌లు కూడా జారీచేశారు.

ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పీసీసీ అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా కుంప‌టి న‌డుపుతున్న కోమ‌టిరెడ్డి...అధికార‌ పార్టీ పై ఇంత దూకుడుగా స్పందించ‌డం ఏంటో మ‌రి.