Begin typing your search above and press return to search.
కిషన్ రెడ్డితో భేటి: రేవంత్ పై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 11 July 2021 11:57 AM GMTపీసీసీ చీఫ్ పదవి దక్కనందుకు కాంగ్రెస్ లో అసమ్మతి రాజేస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తాజాగా బీజేపీ కేంద్రమంత్రులను వరుసగా కలుస్తూ కాంగ్రెస్ లో అలజడి సృష్టిస్తున్నాడు. నిన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని మాండవీయను కలిసిన కోమటిరెడ్డి తాజాగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో భేటి అయ్యారు.
తెలంగాణకే చెందిన కిషన్ రెడ్డిని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కోమటిరెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. పర్యాటక శాఖ మంత్రిగా భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని కిషన్ రెడ్డిని కోరారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి ఖిల్లా అభివృద్ధికి కేంద్రప్రభుత్వం తరుఫున నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
ఇక కిషన్ రెడ్డితో భేటీ నేపథ్యంలో తాను కాంగ్రెస్ లో ఉంటానని.. పార్టీ మారే ఆలోచన లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తన దృష్టిలో పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నదని అన్నాడు. కాంగ్రెస్ ను ముందుకు నడిపే సమర్థమైన నేత లేరని.. రేవంత్ రెడ్డి చిన్నపిల్లవాడని.. ఆయన గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని స్పష్టం చేశారు. రాజకీయాలపై మాట్లాడనని గతంలోనే చెప్పానని.. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
రేవంత్ కు ప్రధాన పోటీదారుగా నిలబడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు పీసీసీ దక్కకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్నాడు. తాజా బీజేపీ పెద్దలను కలుస్తూ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ అప్పగించడంపై జీర్ణించుకోలేకపోతున్నాడు.. ఇక నుంచి తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని.. తన నియోజకవర్గం, జిల్లాకే పరిమితం అవుతానని కోమటిరెడ్డి స్పష్టం చేశాడు. హుజూరాబాద్ లో రాబోయే ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా టీటీడీపీ మాదిరిగానే మారబోతోందని వ్యాఖ్యానించారు. పీసీసీని ఇన్చార్జి అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలతో బయటపెడుతానని కోమటిరెడ్డి ఆరోపించారు. టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్టు తనకు ఢిల్లీ వెళ్లాక తెలిసిందన్నారు. ఇక తాను మాత్రం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై విమర్శలు చేయనని.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం దూరంగా ఉంటానని కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి అసంతృప్తి జ్వాల ఇంకా చల్లారడం లేదు.