Begin typing your search above and press return to search.

కేసీఆర్ మ‌దిలో ఏముందో చెప్పేస్తున్న కోమ‌టిరెడ్డి

By:  Tupaki Desk   |   30 Sep 2017 4:35 AM GMT
కేసీఆర్ మ‌దిలో ఏముందో చెప్పేస్తున్న కోమ‌టిరెడ్డి
X
న‌ల్ల‌గొండ ఉప ఎన్నిక వేడిని తెలంగాణ సీఎం కేసీఆర్ ర‌గ‌ల్చ‌గా...విప‌క్షాలు ఆ ఊపును మ‌రింత‌గా ముందుకు తీసుకుపోతున్నాయి. ఇప్ప‌టికే త‌మ‌దైన శైలిలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌, విప‌క్ష టీడీపీ తాము సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న‌ప్ప‌టికీ త‌న‌దైన శైలిలో సొంత ఎజెండాతో ముందుకు సాగే సీనియ‌ర్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి సైతం తాజాగా ఉప ఎన్నిక‌కు సై అని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మ‌న‌సులో ఏముందో కూడా చెప్పేశారు. అయితే ఇందుకు త‌న‌దైన శైలిలో ఓ ట్విస్ట్ ఇచ్చారు. నల్లగొండ మున్సిపాల్టీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన అనంత‌రం కోమ‌టిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎక్కడా లేనివిధంగా నల్లగొండ మున్సిపాల్టీపై ప్రేమ చూపుతూ ప్రతి వార్డుకు ఒక జిల్లా స్థాయి అధికారిని నియమించి అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం హడావుడి చేస్తుండడం చూస్తే ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డితో రాజీనామా చేయించి నల్లగొండ పార్లమెంటు ఉప ఎన్నికకు టీఆర్‌ ఎస్ సిద్ధమవుతున్నట్లుగా భావిస్తున్నామని సీఎల్పీ ఉపనేత - నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి జోస్యం చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక కోసం ఉవ్విళ్లూరుతున్నారని కోమ‌టిరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలో గెలిచి 2019 ఎన్నికలకు సమరభేరి మోగించేందుకు సిద్ధంగా ఉందని కోమటిరెడ్డి అన్నారు. ఇటీవల తన నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలకు సీడిఎఫ్ నిధులు 21 కోట్లు కేసీఆర్ మంజూరు చేయడంతో పాటు ఇతర అభివృద్ధి పనులపై జోరుగా నిధుల మంజూరుకు పచ్చజెండా ఊపుతూ ఉప ఎన్నికల రాజకీయానికి తెరలేపారన్నారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ నల్లగొండ పర్యటనకు వస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోందన్నారు. ఇన్నాళ్లుగా రాజకీయ వైరంతో తన నియోజకవర్గం అభివృద్ధికి నిధులివ్వని కేసీఆర్ ప్రభుత్వం ఉపఎన్నిక పుణ్యమా అని నిధుల మంజూరు చేస్తుండడంతో అభివృద్ధి కోసం ఉప ఎన్నికను తాను స్వాగతిస్తున్నానన్నారు. ఉప ఎన్నిక వస్తే ప్రభుత్వం మెడికల్ కళాశాల, 10 వేల డబుల్ బెడ్‌ రూమ్‌ లు - సీసీ రోడ్లు మంజూరు చేసేటట్లుగా ఉందన్నారు. అందుకే తాను ఎంపి గుత్తా సుఖేందర్‌ రెడ్డి రాజీనామా కోసం ఎదురుచూస్తున్నానని కోమ‌టిరెడ్డి పేర్కొన్నారు.

నల్లగొండ పార్లమెంటు స్థానానికి ఎంపి గుత్తా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తే గుత్తాపై తాను పోటీ చేసి ఓడిస్తానని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఆదేశిస్తే గుత్తాపై పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గుత్తా రెండు లక్షల మెజార్టీతో గెలిచాడని ఈ దఫా కూడా టీఆర్‌ ఎస్ మెడికల్ కళాశాల ఇచ్చినా, 10 వేల డబుల్ బెడ్‌ రూమ్‌ లిచ్చినా మళ్లీ కాంగ్రెస్ అభ్యర్ధినే గెలుస్తారన్నారు. గుత్తా కాకుండా టీఆర్‌ ఎస్ నుంచి మరో అభ్యర్ధిని నిలబడితే తమ పార్టీ నుండి కూడా మరో అభ్యర్థిని నిలిపితే అతనిని గెలిపిస్తామన్నారు. ఉప ఎన్నిక విష‌యంలో టీఆర్ ఎస్ పార్టీ సై అంటే తాము సిద్ధంగా ఉన్నామ‌న్నారు.