Begin typing your search above and press return to search.

లిఖిత‌పూర్వ‌కంగా దొరికిన కేసీఆర్ !

By:  Tupaki Desk   |   23 May 2018 7:57 AM GMT
లిఖిత‌పూర్వ‌కంగా దొరికిన కేసీఆర్ !
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు చిత్ర‌మైన అనుభ‌వం ఎదురైంది. ప్ర‌త్యేక సంద‌ర్భాన శుభాకాంక్ష‌లు తెలిపితే అది కాస్త ఆయ‌న‌కే రివ‌ర్స్ అయింది. ఇంకా చెప్పాలంటే కొత్త వివాదాన్ని సృష్టించింది. ఇంత‌కీ అలా వివాదం సృష్టించిన వ్య‌క్తి ఎవ‌రంటే నల్గొండ ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం సంద‌ర్భంగా ఆయ‌న దురుసు ప్ర‌వ‌ర్త‌న ముదురుపాకాన ప‌డి ఎమ్మెల్యే స‌భ్య‌త్వం ర‌ద్దు అయ్యేవరకు చేరింది. ఈ వివాదం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది.

ఈ వివాదం ఇలా ఉంటే...ఈరోజు మే 23వ తేదీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అనూహ్య‌మైన ట్విస్ట్ ఇచ్చారు. కోమ‌టిరెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌త్యేకంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. నిండునూరేళ్లు ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని - ప్ర‌జాసేవ‌లో వ‌ర్ధిల్లాల‌ని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఈ మేర‌కు త‌న స్వ‌ద‌స్తూరితో చేసిన సంత‌కంతో కూడిన లేఖ‌తో కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే కేసీఆర్ ఇలా శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనూహ్య‌రీతిలో స్పందించారు.

కేసీఆర్‌ శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం సంతోష‌క‌ర‌మ‌ని చెప్పిన‌ కోమ‌టిరెడ్డి త‌న‌ను ఎమ్యెల్యేగా సంబోధిస్తూ లిఖిత పూర్వ‌కంగా పంపారు. మ‌రి ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ప్ర‌కారం ద‌క్కాల్సిన‌వి ఎందుకు పరిశీలించడం లేదని కోమటిరెడ్డి లాజిక్ తీశారు. భద్రత - ఇతర సౌకార్యాలు కల్పించే సీఎం ఎందుకు పట్టించుకోలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ శుభాకాంక్ష‌లు కాస్త కొత్త చ‌ర్చ‌కు తెర‌తీసిన‌ట్ల‌యిందని అంటున్నారు. కేసీఆర్ ఇలాంటి పొర‌పాట్లు కూడా చేస్తుంటారా అని కామెంట్లు చేస్తున్నారు జ‌నం.