Begin typing your search above and press return to search.
కేసీఆర్ చేసిన తప్పు.. కోమటిరెడ్డికి వరం..
By: Tupaki Desk | 26 May 2018 5:43 AM GMTతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - సీఎం కే. చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాసిన లేఖ వివాదాస్పదమైంది. ఆ లేఖలో కోమటిరెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్..ఇప్పుడు ఈ లేఖనే టీఆర్ ఎస్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ లేఖలో కేసీఆర్.. కోమటిరెడ్డిని ఎమ్మెల్యే అని సంభోదించడంతో ఆయన దొరికిపోయారు.
నిజానికి కోమటిరెడ్డితో పాటు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను తెలంగాణ అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను స్పీకర్ మధుసూదనచారి వారి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. వీరు ఇప్పుడు ఎమ్మెల్యేలు కారు.కానీ తరువాత కోమటిరెడ్డి - సంపత్ లు హైకోర్టుకు వెళ్లడంతో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన కోమటిరెడ్డి ని పట్టుకొని కేసీఆర్ .. ‘ఎమ్మెల్యే కోమటిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది.
కేసీఆర్ లేఖ నేపథ్యంలో కోమటిరెడ్డి... కేసీఆర్ వైఖరిని తూర్పారపట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే తనను ఎమ్మెల్యేగా సంభోదించారని.. ఇప్పటికైనా కోర్టులు - అసెంబ్లీ వర్గాలు తన శాసన సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు. అంతేకాదు.. ఎమ్మెల్యే పదవి పోయాక తనకు తీసేసిన సెక్యూరిటీని తిరిగి కేటాయించాలని డీజీపీని కోమటిరెడ్డి కోరారు.
కేసీఆర్ తనను స్వయంగా ఎమ్మెల్యే అంటూ లేఖరాశారని.. ఇప్పటికైనా టీఆర్ ఎస్ వర్గాలు ఈ తప్పును తెలుసుకొని నాకు సంజాయిషీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
అయితే కోమటిరెడ్డికి ఎమ్మెల్యే అంటూ లెటర్ పంపడంపై టీఆర్ ఎస్ వర్గాలు స్పందించాయి.. ఇది సీఎంవో సిబ్బంది చేసిన తప్పు అని తప్పించుకుంటున్నారు. దీనిపై కోమటిరెడ్డి మండిపడుతున్నారు. తప్పు వారి మీద వేస్తే ఒప్పు అవుతుందా అని మండిపడ్డారు.
ఈ విషయంలో నల్గొండ టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు - ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇదో కామన్ ప్రక్రియ అని.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందరూ ఎమ్మెల్యేలకు బర్త్ డే శుభాకాంక్షలు వెళుతాయని.. ఆ కోవలోనే కోమటిరెడ్డికి వెళ్లాయని.. దీన్ని పట్టుకొని రాద్ధాంతం చేయవద్దని’’ సూచించారు.
అయితే కోమటిరెడ్డికి బర్త్ డే విషెస్ చెబుతూ పంపే లెటర్ పైన స్వయంగా సీఎం కేసీఆర్ సంతకం ఉంది. ఈ నేపథ్యంలోనే తనను ఎమ్మెల్యే కాదనడంలో అర్థమే లేదని కోమటిరెడ్డి వాదిస్తున్నారు. ఏదీ ఏమైనా కేసీఆర్ చేసిన ఈ తప్పును పట్టుకొని పోరాడేందుకు కోమటిరెడ్డి రెడీ అవుతున్నారు.