Begin typing your search above and press return to search.

2019లో కాంగ్రెస్ సీఎం ఆయ‌నేన‌ట‌

By:  Tupaki Desk   |   11 Dec 2016 8:39 AM GMT
2019లో కాంగ్రెస్ సీఎం ఆయ‌నేన‌ట‌
X
కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్య‌ర్థుల జాబితా పెరిగిపోతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు, మాజీ మంత్రులు ఈ స్థానంపై ఆశ పెట్టుకొని ఉండ‌గా...ఈ రేసులోకి సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేరారు. నిర్మల్ జిల్లా కడెంలో కాంగ్రెస్ కార్యకర్తలతో భేటీ అయిన అనంతరం విలేకరుల సమావేశంలో కోమ‌టిరెడ్డి మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి అధిష్ఠానానికి బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశా రు. రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేసు లో తానే ఉన్నాననీ, 2019లో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిని అవుతానని కోమ‌టిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం సాధించేలా కలిసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు కోమ‌టిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పటిష్టత తగ్గిందని, పూర్వవైభవం కోసం పాటుపడాలని కోరారు. వర్గవిభేదాలు వీడి పార్టీకోసం పనిచేయాలని కోరారు.

ఇదిలాఉండ‌గా... అధికార టీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన భాగస్వామి మాత్రమేనని, చట్టబద్దంగా తెలంగాణ ఏర్పాటు చేసింది మాత్రం కాంగ్రెస్‌ పార్టీయేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హాస్‌లో ఉంటేనో, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాలేజీలు పెట్టుకొని లక్షల ఫీజులు వసూలు చేస్తేనో తెలంగాణా రాలేదన్నారు. ప్రతిపక్షాలను కడిగేస్తామన్న హరీశ్‌రావు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శాసన సభ వ్యవహారాల మంత్రిగా ఉంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని చెప్పారు.