Begin typing your search above and press return to search.
ఎన్నికలకు నెల ముందే రాజకీయం.. నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ.. తమ్ముడి కోసమా కోమటిరెడ్డి?
By: Tupaki Desk | 11 Dec 2022 12:30 PM GMTబీజేపీలోకి వెళ్లక.. కాంగ్రెస్ లో ఉండలేక.. తమ్ముడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సమయంలో.. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో పార్టీని దిశానిర్దేశం చేయాల్సిన వేళ.. విదేశాలకు వెళ్లిపోయి.. పోలింగ్ కు ముందు రోజు తిరిగొచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన షాక్ పై నోరు విప్పారు. ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై ఏమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు. అయితే, పనిలోపనిగా తాను నల్లగొండ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే.. ఎంపీ పదవికి పోటీలో ఉండనని చెప్పేశారు. కాగా, వెంకటరెడ్డి నల్లగొండ నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఆయన ఓడిపోయారు. దీంతో 2019 ఎంపీ ఎన్నికల్లో భువనగిరి బరిలోనిలిచారు. ఇప్పుడు నల్లగొండ నుంచే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని తెలిపారు.
పార్టీ ఏది..?
నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వెంకటరెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేసేదీ చూడాల్సి ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన పీసీసీ కార్యనిర్వాహక, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో ఆయన పేరు లేకపోవడం చూస్తే పార్టీలో వెంకటరెడ్డి మాట చెల్లుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికితోడు మునుగోడు ఎన్నిక ముంగిట తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్ వారిని కోరడంతో పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి గురై షోకాజ్ ను ఎదుర్కొన్నారు.
ఇప్పుడు మళ్లీ పదవుల నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన వ్యహరించిన తీరు పట్ల అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. ఆపై కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు కోమటిరెడ్డి అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ.. చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కమిటీల్లో చోటివ్వలేదు.
2023 వరకు ఆగుతారా?
ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై ఏమీ మాట్లాడనని వెంకట్‌రెడ్డి పేర్కొనడం చూస్తుంటే.. ఆయన వచ్చే 10 నెలలు మౌనం దాల్చుతారని తెలుస్తోంది. ఆపై ఆయన ఏ పార్టీ అనేది తర్వాత సంగతి. అయితే, వెంకటరెడ్డిని కాంగ్రెస్ వదులుకుంటుందా..? లేదక ఆయనే వెళ్లిపోతారా? అనేది చూడాలి. తమ్ముడు రాజగోపాల్ రెడ్డితో కలిసే రాజకీయం చేస్తానని గతంలో ఢిల్లీలో పేర్కొన్న ఆయన ఇప్పుడు కీలక సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది తేలాలి. అంతేగాక, ఒకరు బీజేపీ, మరొకరు కాంగ్రెస్ అంటూ కోమటిరెడ్డి వేర్వేరుగా బరిలో ఉంటే నల్లగొండ రాజకీయ ముఖచిత్రమే వేరుగా ఉంటుంది. ఎవరికి మద్దతివ్వాలో శ్రేణులకే కాదు.. నాయకులకూ ప్రశ్నగానే ఉంటుంది. చాలాకాలంగా ఏకతాటిపై ఉన్న సోదరులు విడివిడిగా బరిలో దిగితే ప్రచారంలోనూ భిన్నంగా ఉంటుంది.
తమ్ముడి కోసమేనా..?
మునుగోడులో ఇటీవల పరాజయం పాలైన రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరఫున ఆయన భువనగిరి ఎంపీగానే పోటీ చేస్తారని సమాచారం. అంటే.. తమ్ముడి కోసం వెంకటరెడ్డి ఎంపీ స్థానాన్ని త్యాగం చేస్తున్నారా? అనే సందేహాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాను నల్లగొండ బరిలో ఉంటే రాజకీయంగానూ లబ్ది చేకూరుతుందని భావిస్తుండవచ్చు.
మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు లెక్కనా?
పార్టీ కమిటీల్లో చోటు కల్పించకపోవడంపై వెంకట్‌రెడ్డి స్పందించారు. "ప్రస్తుతం కాంగ్రెస్ కండువా ఉంది.. మిగతా సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎన్నికలకు నెలముందు వరకు రాజకీయాలపై మాట్లాడను. మంత్రి పదవినే వదిలేశా.. పార్టీ పదవులు నాకో లెక్కనా?" అని వ్యాఖ్యానించారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికలో వ్యవహరించిన తీరుతోనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన కమిటీల్లో కోమటిరెడ్డికి స్థానం దక్కలేదని ప్రచారం సాగుతోంది. పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటూ సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం కోసం పరోక్షంగా పనిచేశారనే ఆరోపణలతో రెండు సార్లు ఇప్పటికే పార్టీ జాతీయ కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటీవల తిరుమల పర్యటనలో మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు, ఎన్నికలకు నెల ముందు తన అభిప్రాయం వ్యక్తం చేస్తానని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆయనను దూరం పెట్టినట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.