Begin typing your search above and press return to search.
డిఫెన్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అధిష్టానం స్కెచ్ కు ఏం చేస్తాడు?
By: Tupaki Desk | 10 Sep 2022 2:30 PM GMTమునుగోడు ఉపఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీకి దిగారు. ఆయన అన్న కాంగ్రెస్ లోనే ఉండి తమ్ముడికి మద్దతుగా రాజకీయం చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ను పాల్వాయి స్రవంతికి ఇవ్వడంతో రాజకీయం మలుపు తిరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరినట్టే మునుగోడు అభ్యర్థిగా స్రవంతి ఎంపిక చేసింది.
ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ముందు నుంచి కృష్ణారెడ్డి అనే అభ్యర్థిని నిలబెట్టాలని చూశారు. కానీ వెంకటరెడ్డి యేమో స్రవంతిని ప్రతిపాదించారు. దీంతో ఈ సంకుల సమరంలో వెంకటరెడ్డి సూచించిన స్రవంతికే టికెట్ ఇచ్చింది అధిష్టానం.. పీసీసీ చీఫ్ రేవంత్ కు షాక్ ఇచ్చింది.ఇప్పుడు స్రవంతిని గెలిపించే బాధ్యత ఎంపీ కోమటిరెడ్డిపై పడింది.
రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమాత్రం పడడం లేదన్న సంగతి తెలిసిందే. కృష్ణారెడ్డి బరిలో ఉంటే ఇప్పటికే అతడిని ఓడించే ప్రయత్నాలు వెంకటరెడ్డి చేసేవాడన్న ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు మొత్తం భారం వెంకటరెడ్డిపై పడింది. అతడు సూచించిన అభ్యర్థినే ప్రకటించిన అధిష్టానం వెంకటరెడ్డిని డిఫెన్స్ లో పడేసింది.
ఇప్పుడు వెంకటరెడ్డి పార్టీ ధర్మానికి కట్టుబడుతాడా? బీజేపీలో ఉన్న తన తమ్ముడిని గెలిపిస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ యుద్ధంలో కోమటిరెడ్ది గెలిస్తే అతడి విశ్వసనీయత పెరుగుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం కోమటిరెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మకం పోతుంది.
అయితే ఇటీవలే తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని వెంకటరెడ్డి తమపై బాగా ఒత్తిడి చేస్తూ ఫోన్లు చేస్తున్నాడని మూడు రోజుల క్రితం కాంగ్రెస్ క్షేత్రస్థాయి నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై వెంకటరెడ్డి స్పందించలేదు. ఇదేకనుక నిజమైతే పార్టీని వెంకటరెడ్డి మోసం చేస్తున్నట్టే లెక్క. అబద్దమైతే మాత్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత వెంకటరెడ్డిపై ఉంది.
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పట్టుబట్టి మరీ స్రవంతికి సీటు తెప్పించుకున్న వెంకటరెడ్డి ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయాడని అంటున్నారు. స్రవంతి అయితే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఈజీగా గెలుస్తాడని ఈ ప్లాన్ చేశాడా? లేక నిజంగానే స్రవంతిని గెలుస్తాడా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లోని ఈ రాజకీయం అంతిమంగా వెంకటరెడ్డి మెడకే చుట్టుకుంటుందన్న ప్రచారం సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.