Begin typing your search above and press return to search.
బీజేపీలోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరిక, డేటి ఫిక్స్ అయ్యిందా?
By: Tupaki Desk | 4 Aug 2022 10:44 AM GMTతమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే అని పైకి అంటున్నా.. ఆ అన్న వెంకటరెడ్డి అడుగులు మాత్రం బీజేపీవైపే పడుతున్నాయని అందరూ అనుమానంగా చూస్తున్నారు. ఎందుకంటే తోడబుట్టిన తమ్ముడు కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలో చేరుతున్న అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఉలుకు లేదు పలుకు లేదు..పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నాయకులు దీని వెనుక వెంకటరెడ్డి హస్తం ఉందన్నా కూడా ఆయన పెద్దగా స్పందించడం లేదు. తమ్ముడు రాజీనామా చేసి వెళ్లాడు కదా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనే కొట్లాటకు దిగుతున్నాడు.
ఆది నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో అసమ్మతి వాదిగానే ఉన్నాడు. సీట్లు, పదవులు ఇవ్వకపోతే అసమ్మతి రాజేయడం అలవాటుగా మార్చుకున్నాడు.అందుకే మొన్న పీసీసీ చీఫ్ పదవి ఇస్తామనుకున్నా.. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసి రేవంత్ రెడ్డికి ఇచ్చారు. వెంకటరెడ్డిలో విశ్వసనీయత లేకపోవడమే దీనికి కారణం అని అంటున్నారు.
పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసమ్మతి రాజేశాడు. పొన్నాలను వదలకుండా ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత సొంత నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అతడిని వదలిపెట్టకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశాడు. ఇక ఇప్పుడు తనకు దగ్గని పదవి రేవంత్ రెడ్డికి వచ్చేసరికి రగిలిపోతూ నాడే గాంధీభవన్ గడప తొక్కనని శపథం చేశాడు. ఆ తర్వాత సైలెంట్ అయినా.. ఇప్పుడు తమ్ముడు బీజేపీలో చేరుతుంటే మౌనం దాల్చాడు. పైకి ఖండించినా లోలోపల వెంకటరెడ్డి మనసు మాత్రం బీజేపీలో చేరికకే ఉబలాటపడుతోందన్నది ప్రచారం సాగుతోంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను రాజకీయాల్లో 34 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. మరి 34 ఏళ్ల నుంచి ఉండి ఎందుకు పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకోలేదు అంటే.. వెంకటరెడ్డికి, అతడి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి బీజేపీతో ఉన్న చీకటి ఒప్పందాలు అని.. హైకమాండ్ కు తెలిసి వెంకటరెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వలేదు అని టాక్ నడుస్తోంది.
మొన్నటిరవకూ కాంగ్రెస్ లోనే బతికి.. ఎదిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా అధినేత్రి సోనియా గాంధీపైనే కామెంట్ చేయడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేదు. సోనియాగాంధీ విషయంలో ఈడీ తన పని తాను చేస్తుందని అన్నప్పుడు ఎందుకు వచ్చి వెంకటరెడ్డి ఖండించలేదన్నది కాంగ్రెస్ వాదులు నిలదీస్తున్న ప్రశ్న?
రేవంత్ రెడ్డి అందుకే బరెస్ట్ అయ్యి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించాడు. దీనికి రెచ్చిపోయిన వెంకటరెడ్డి 'నన్ను ఎందుకు అన్నాడని.. క్షమాపణ చెప్పాలని' రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఓపెన్ గానే 'కోమటిరెడ్డి బ్రాండ్ అని అంటుంటే'.. దీన్ని బేస్ చేసుకొనే రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించాడు. అన్నా తమ్ముడు కలిసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఒక బ్రాండ్ అంటే అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలానే వాడేమో అని కాంగ్రెస్ వాదులు అంటున్నారు.
ఇవన్నీ కాంగ్రెస్ వాదులు వేసే ప్రశ్నలు.. వీటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర సమాధానాలు లేవు కాబట్టి.. అందులో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డిని పార్టీలో ఒక పార్టీ కార్యకర్త కంటే తక్కువగా చూడాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే రాజగోపాల్ రెడ్డి మాదిరి కాంగ్రెస్ లోకి వెంకటరెడ్డి చేరుతాడని బీజేపీ ఆఫీసులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందంట.. డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని బీజేపీ శ్రేణులు అంటున్నారు. మరి వచ్చే రెండు రోజుల్లో డేట్ ఫిక్స్ అవుతుందని.. వెంకటరెడ్డి బీజేపీలో చేరబోతున్నాడని ప్రచారం సాగుతోంది. చూద్దాం కోమటిరెడ్డి కూడా తమ్ముడి బాటలోనే బీజేపీలోకి వెళతాడా? లేక కేవలం ఇవన్నీ ప్రచారం అని ఉంటాడా? అన్నది వేచిచూడాలి.