Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి చేతిలో కేటీఆర్ మంత్ర దండం

By:  Tupaki Desk   |   8 Feb 2018 11:55 AM GMT
కోమ‌టిరెడ్డి చేతిలో కేటీఆర్ మంత్ర దండం
X
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలంగాణ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ ఆ పార్టీ నేత‌ల్ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మంత్ర‌దండం త‌న చేతుల్లో ఉంద‌ని అవ‌స‌రం అనుకుంటే బ‌హిర్ఘ‌తం చేస్తాన‌ని హెచ్చ‌రించారు.

కొద్దిరోజుల క్రితం కోమ‌టిరెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు నల్గొండ మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే శ్రీనివాస్ ది రాజ‌కీయ హ‌త్య అని ఇందులో ప్ర‌భుత్వ ప్ర‌మేయం ఉంద‌ని కోమ‌టి రెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. అంతేకాదు స్థానిక డీఎస్పీ అండ‌తో త‌న అనుచ‌రుడి హ‌త్య జ‌రిగిందని..వెంట‌నే ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేశారు. అప్ప‌టి నుంచి టీఆర్ఎస్ నేత‌ల‌పై కోమ‌టి రెడ్డి మాటల‌తో మంట‌పుట్టిస్తున్నారు.

కాగా గద్వాల బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి స‌వాల్ విసిరారు. త్వ‌ర‌లో జ‌రిగే ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఓడిపోతే నేను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా. మ‌రి పీసీపీ చీఫ్ ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటారా అని స‌వాల్ విసిరారు. ఆ స‌వాల్ పై ప్ర‌తి స‌వాల్ చేసిన ఉత్త‌మ్ కుమారెడ్డి తాను ఓడిపోతే కుటుంబ స‌భ్యుల‌తో స‌హా అంద‌రం రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాం. మ‌రి కేటీఆర్ ఓడిపోతే ఆయ‌న కుటుంబ స‌భ్యులు హ‌రీష్ రావు - కవిత‌ - కేసీఆర్ లు స‌న్యాసం తీసుకుంటారా అని ప్ర‌శ్నించారు..?

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఓడిపోతే నేనూ రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సూచించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ త‌ర‌చు విదేశాల‌కు ఎందుకు వెళుతున్నాడో త‌న‌కు తెలుస‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్ట్ లో దోచుకున్న సొమ్మును దాచిపెట్టుకోవ‌డానికే వెళుతున్నారు. కేటీఆర్ త‌న‌పై 'టీఆర్‌ ఎస్‌ తలుపులు తట్టీ తట్టీ కుదరక కోమటిరెడ్డి వెనక్కి పోయారు అని చేస్తున్న అస‌త్య ప్ర‌చారంపై కోమటిరెడ్డి త‌న‌దైన స్టైల్లో రిప్ల‌యి ఇచ్చారు. తన ఆఫీస్‌ కు వచ్చి మంత్రి పదవి ఇస్తానని కేటీఆర్‌ ఆఫర్‌ చేశారని.. కావాలంటే అందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయట పెడతానని కోమటిరెడ్డి తెలిపారు.