Begin typing your search above and press return to search.
ఈ ఎంపీని కోమటిరెడ్డి లెక్కచేయట్లేదట
By: Tupaki Desk | 7 Jan 2017 8:03 AM GMTకాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విభిన్నమైన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే కోమటిరెడ్డి తాజాగా అదే రీతిలో మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డిది తన స్ధాయి కాదని కోమటిరెడ్డి తెలిపారు. ఎంపీగా గుత్తాను రెండు సార్లు తానే గెలిపించానని కోమటిరెడ్డి ప్రకటించారు. పదవికి రాజీనామా చేయడం గురించి ఇటీవల గుత్తా సుఖేందర్ రెడ్డి విసిరిన సవాల్ గురించి కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లా పరిధిలో ఎక్కడ పోటీ చేసినా తాను గెలుస్తానని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తనపై గుత్తా నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయనకు పోటీగా తను బరిలోకి దిగకుండా ఒక కార్యకర్తను నిలబెడతానని ఎద్దేవా చేశారు. తాము ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు పోగుట్టుకుంటే గుత్తా ఎన్నికల్లో పోటీ చేసి డబ్బు సంపాదించారని ఆరోపించారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి తమ పేరు పరిశీలనలో ఉందనే విషయంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ తమ సోదరుల్లో ఎవరికి పీసీసీ చీఫ్ ఇచ్చినా సంతోషమేనన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదనీ, కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నదే తమ కోరికని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు తన మదిలోని ఆలోచనను వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/