Begin typing your search above and press return to search.
మళ్లీ కోమటిరెడ్డి టైమ్.. పీసీసీ స్టార్ క్యాంపెయినర్.. కానీ,
By: Tupaki Desk | 10 April 2022 11:33 AM GMTనల్లగొండ జిల్లా నేత, మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది.ఏడాదిన్నరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. కోమటిరెడ్డి నియామకానికి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదం తెలిపినట్లు ఆ ప్రకటనలో వేణుగోపాల్ పేర్కొన్నారు.
ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. కోమటిరెడ్డి మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ అయ్యేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. వాస్తవానికి 30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో కీలక నేతగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీరి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్సీగానూ గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో పీసీసీ పదవిని ఆశించారు వెంకటరెడ్డి. కానీ, దానిని రేవంత్ రెడ్డి తన్నుకుపోవడంతో పార్టీపై కినుక వహించారు. రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిని చేయగానే.. తాను ఇక నల్లగొండ జిల్లాకే పరిమితం అవుతానని, పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించిన వెంకటరెడ్డి తర్వాతి పరిణామాల్లో మెత్తబడ్డారు. చివరకు అనూహ్యంగా రేవంత్ తో సయోధ్యకు సిద్ధపడ్డారు. పార్టీ నిర్వహించిన ఓ ఆందోళన కార్యక్రమంలో రేవంత్ తో కలిసి పాల్గొన్నారు. ఇటీవల కూడా రేవంత్ తో సన్నిహితంగా నే మెలుగుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు స్టార్ క్యాంపెయినర్ గిరీ దక్కింది.
నల్లగొండకు ఓకే.. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్లగొండ జిల్లా వరకు టాప్. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వీరి అనుచరవర్గం ఉంది. కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాపకంతో ఎదిగిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనలానే మంచి ప్రజాదరణ పొందారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనూహ్య ఓటమి చాలామందిని బాధించింది అంటేనే ఆయనకున్న ఫాలోయింగ్ ఏపాటిదో తెలియజేస్తుంది. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచి తన సత్తాచాటారు వెంకటరెడ్డి.
అంతేకాదు.. జిల్లాలో కనీసం మూడునాలుగు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోగల సత్తా కోమటిరెడ్డి సోదరులది. కానీ, కొంత కాలంగా పార్టీ పట్ల వీరి విధేయత ప్రశ్నార్థకం అవుతోంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగడంపై ఊగిసలాటలో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరతారని బలంగా ప్రచారం ఉంది. దీంతో తమ్ముడి నిర్ణయంతో తమకు సంబంధం లేదంటూ ఇటీవల వెంకటరెడ్డి స్పష్టం చేయాల్సి వచ్చింది. మరోవైపు వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారంటూ వదంతులు వచ్చాయి. చివరకు అవి వదంతులుగానే మిగిలిపోయాయి.
రాష్ట్రమంతటా మరి? ఎన్ని చెప్పుకొన్నా.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ స్టార్ అంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే. పార్టీ కార్యక్రమాలను ముందుకుతీసుకెళ్లడంలో కానీ, సొంతంగా కార్యక్రమాల రూపకల్పనలో కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంలో కానీ రేవంత్ దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి మూలన కార్యక్రమాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని ఉత్తేజితం చేస్తున్నారు. సీనియర్లు అడ్డు పుల్లలు వేసినా.. అధిష్ఠానం తరఫు నుంచి నరుక్కొచ్చిన రేవంత్ తనకు ఎదురులేదన్నట్లు కనిపిస్తున్నారు.
ఈ క్రమంలో రేవంత్ పై అసమ్మతి గళం విప్పిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా అధిష్ఠానం హెచ్చరించింది. ఆయన బాధ్యతల్లో కోత పెట్టింది. దీన్నిబట్టే అధిష్ఠానం వద్ద రేవంత్ స్థాయి ఎలా ఉందో తెలిసిపోతోంది. అటు ప్రజల్లో, ఇటు పార్టీలో రేవంత్ పాపులారిటీ ముందు నిలవడం కష్టమే. అసమ్మతిని చల్లార్చే క్రమంలో వెంకటరెడ్డికి స్టార్ క్యాంపెయినర్ ఇచ్చిన పార్టీ.. ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించడంలో తప్పులేదే. కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ హవా ప్రస్తుతం నల్లగొండ జిల్లాకే పరిమితమైంది.
ఫాలోయింగ్ ఉన్నా.. ట్రెండ్ ను ఫాలో కాలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉన్నది వాస్తవమే. రాజకీయంగానూ చిన్న వయసులోనే ఆయనకు పదవులు దక్కాయి. తెలంగాణ కోసమంటూ మంత్రి పదవిని త్యాగం చేసిన పేరుంది. ఆర్థికంగానూ ఫర్వాలేకున్నారు. అయితే, 2012 తర్వాత కొన్ని కారణాల రీత్యా పార్టీలో ఏర్పడిన గ్యాప్ ను వెంకటరెడ్డి సద్వినియోగం చేసుకోలేకపోయారు.
వాస్తవానికి తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా ఊపును కొనసాగించి ఉంటే వెంకటరెడ్డి స్థాయి ప్రస్తుతం మరోలా ఉండేది. కానీ, రాష్ట్రంలోని రాజకీయ శూన్యతలో ఆయన స్టార్ నేతగా ఎదగలేకపోయారు. అదే సమయంలో కొడంగల్ నుంచి 2009లో ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్ అనూహ్యంగా పుంజుకొన్నారు. 2018 ఎన్నికల్లో ఓడినా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి తన వాగ్ధాటితో పీసీసీ చీఫ్ గా ఎదిగారు.
రాష్ట్రవ్యాప్తంగానూ హవా చాటుతున్నారు. మొదట్లో తనను వ్యతిరేకించినవారినీ కలుపుకొని పోతూ తన ముద్ర వేసుకుంటున్నారు. ఇక్కడే వెంకటరెడ్డి వెనుకబడిపోయారు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసుకునే అవకాశం దొరికింది. దీనిని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.