Begin typing your search above and press return to search.

కేసీఆర్ లక్ష కోట్ల స్కాంకు ఆధారాలున్నాయి.. కోమటిరెడ్డి సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   22 April 2022 2:38 PM GMT
కేసీఆర్ లక్ష కోట్ల స్కాంకు ఆధారాలున్నాయి.. కోమటిరెడ్డి సంచలన ప్రకటన
X
తెలంగాణలో ముక్కోణపు పోటీ నెలకొననుందని తెలుస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ,  కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలుచేస్తున్నాయి. ఇందులో భాగంగానే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే రాష్ర్టంలో పాగా వేయాలని పావులు కదుపుతున్నాయి. ఓ పక్క బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తుండగా కాంగ్రెస్ అధికార పార్టీ టీఆర్ఎస్ అవినీతిపై గళం విప్పుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. లక్ష కోట్ల స్కాం చేశారని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. దీనిపై పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో బీజేపీ నేతలు చెబుతున్నట్లు జైలుకెళ్లడ ఖాయమనేనా అనే వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం కేసీఆర్ అవినీతి బయటపెడతామని చెబుతుండటం దీనికి మరింత బలం చేకూరుస్తోంది

ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల్లో సొమ్మంతా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది ఇందులో పర్సంటేజీలు భారీగా చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని కేసీఆర్ చెబుతున్నా లోపల మాత్రం భయపడుతున్నట్లు పలువురు నేతలు చెబుతున్నారు. దీంతో భవిష్యత్ బొంగరంలా తిరిగే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసీఆర్ భండారం బయట పడుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పనుల్లో అమ్యామ్యాలే వారికి అనుకూలంగా నిలిచాయనే వాదనలు సైతం వస్తున్నాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ రాజకీయ జీవితానికి ఇక చరమగీత పాడటమే అనే ఊహాగానాలు వస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ నే టార్గెట్ చేసుకుంటోంది. ఇందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించి అందరు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన నేపథ్యలో రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాత్ కిషోర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నేతల్లో ఉన్న వైషమ్యాలు పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలని ఆదేశాలు జారీ అయిన సందర్భంలో రాష్ట్రంలో పార్టీని నిలబెట్టి కేసీఆర్ కు తగినగుణపాఠం చెప్పాలని భావిస్తోంది.

ఈనేపథ్యంలో బీజేపీ కూడా తన టీఆర్ఎస్ నే తమ ప్రధాన ప్రత్యర్థిగాభావిస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని పలు సందర్భాల్లో కూడా నేతలు చెబుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికలు మరింత టఫ్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి, ఈ సందర్భంలో టీఆర్ఎస్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారుతోంది పరిస్థితి. దీంతో వచ్చే ఎన్నికలనుఅంత సులువుగా తీసుకునే పరిస్థితి లేదు. కచ్చితంగా వ్యూహాలు ఖరారు చేసుకుని పార్టీలు బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పతనానికే ఓటు వేస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ తోడు దొంగలని అభివర్ణిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టి టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచుతామని ప్రకటిస్తున్నారు, దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా సపోర్టు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఇక కష్టకాలమే అని విశ్లేషకులు చెబుతున్నారు. టీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయనే వాదనలు అన్ని పార్టీల్లో వస్తున్నాయి.